సభలు సజావుగా జరిగేనా ?

21:28 - December 4, 2016

న్యూఢిల్లీ : ఒకవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా,.మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఈ విప్ జారీ అయింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమవుతుండగా, లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహాంపై కాంగ్రెస్ పార్టీ ఉదయం 10.30 గంటలకు సమావేశమవుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు...అటు బీజేపి కూడా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుంలందరికి విప్‌ జారీచేసింది. సోమవారం పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ విప్‌లో పేర్కొంది. దీంతో సోమవారం నాడు లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష, అధికార పక్షాల ఆందోళనలతో అట్టుడికే అవకాశం కన్పిస్తోంది.

Don't Miss