అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోయింది : ఆజాద్

11:26 - December 8, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నేడు కూడా విపక్షాలు నోట్ల రద్దుపై ఆందోళన చేపట్టాయి. తీవ్ర గందరగోళం మధ్య లోక్ సభలలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. లోక్ సభలో స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చి విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగిస్తున్నారు. చేస్తున్నారు...మరో పక్క రాజ్యసభలో కూడా ఇదే వాతావరణ కొనసాగుతోంది. సభ జరిగేందుకు సహకరించాలని చైర్మన్ హమీద్ అన్సారీ కోరారు..వినని విపక్షాలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.పెద్ద నోట్ల రద్దు అనంతరం వంద మంది రైతులు..వృద్ధులు..ఇతరులు మృతి చెందారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో అంతర్జాతీయస్థాయిలో భారత్ పరువు పోయిందన్నారు. నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా 100మందికి పైగా చనిపోయారనీ..వివాహాలు నిలిచిపోయాయి..చిల్లర కొరతతో మెడిసిన్స్ దొరకకు తీవ్ర అవస్థలకు గురవుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గురావటంలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల జీవితాలలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం మృతి చెందినవారికి సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఈ రోజు గాంధీ విగ్రహం వద్ద విపక్షాల బ్లాక్ డే నిర్వహించాయన్నారు.మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతీరోజూ విపక్షాలు ఇదే పరిస్థితిని కొనసాగిస్తున్నారనీ..సభ కొనసాగటం విపక్షాలకు ఇష్టం లేదనీ..అందుకే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ఆందోళన కొనసాగించటంతో చైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను మ.12 గంటలకు వాయిదా వేశారు. ఆందోళన మధ్య లోక్ సభ కొనసాగుతోంది.

Don't Miss