విమాన ప్రమాదంపై ఉభయసభల్లో హాట్ హాట్ చర్చ

11:58 - December 1, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. నగ్రోటా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు లోక్ సభ నివాళి అర్పించింది. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన అంశాన్ని సభల్లో విపక్ష సభ్యులు లేవనెత్తారు. విచారణ జరిపించాలని సభ్యులు డిమాండ్ చేశారు. బెంగాల్ విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. విమానం బయలుదేరే సమయంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ సభ్యురాలు మాయావతి డిమాండ్ చేశారు. విమాన ప్రమాద ఘటన విషాదకరమన్నారు. విచారణ జరిపించాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. 
ప్రమాద ఘటనపై రాజ్యసభలోనూ చర్చ
పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. విమానాల్లో ఇంధనం ఎంతుందో సమాచారం ఉందని, ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు. విమానంలో ప్రయాణించే వారి క్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss