సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం..

10:57 - December 6, 2016

తమిళనాడు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూయడంతో అర్థరాత్రి 1:30 గంటలకు రాజ్‌భవన్‌లో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 15 మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్ సెల్వంతో ప్రమాణస్వీకారం చేయించారు. జయలలిత మృతి పట్ల ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమిళనాడులో సీఎం మృతితో ఏడు రోజులు సంతాప దినంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మకు వీరాభిమాని..వీర విధేయుడు అయిన పన్నీర్ సెల్వం మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెల్వంతో పాటు 31మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

అమ్మకు శ్రద్ధాంజలి ఘటించనున్న పలువురు ప్రముఖులు
రాజాజీ హాలుకు నేడు ప్రధాని మోదీ,కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, జాతీయ నేతలు..పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..పలు పార్టీల నాయకులు అమ్మకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఆమె అభిమానులు కూడా ఆమె పార్థీవదేహాన్ని కడసారి సందర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సోమవారం నుండి భారీగా వున్న పోలీసులు బలగాల నుండి కేంద్ర భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. నేడు కూడా అభిమానుల సందర్శనార్థం వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యే అవకాశముండటంతో కేంద్రం నుండి మరింతగా బలగాలు తమిళనాడుకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాపదినాలను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Don't Miss