బంగారంపై పరిమితిని వ్యతిరేకించిన ఏపీ కేబినెట్..

19:00 - December 1, 2016

విజయవాడ : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చి జరిగింది. బంగారంపై పరిమితిని వ్యతిరేకించాలని సీఎంకు మంత్రులు సూచించారనీ..ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు మంత్రులు సూచించారు. సమావేశం అనంతరం వీడియాతో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి రూ.800లకోట్లు ఆదాయం తగ్గిపోయిందని పల్లె పేర్కొన్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు..బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకూ మొత్తం 26 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గం నిర్మాణానికి భూసేకరణతో కలిపి రూ.7212 కోట్లు ఖర్చవుతున్నాయని మంత్రి తెలిపారు. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి రూ.800 కోట్లు నష్టం వాటిల్లిందనీ..ఈ నెలాఖరుకు ఇది రూ.1500లకు చేరుతుందని కేబినెట్ అంచనా వేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను వచ్చేనెల నుండి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయంచిందన్నారు. చిత్తూరు జిల్లా అపోలో టైర్లకంపెనీకి వంద ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ నిర్ణయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లకు వేతనాలు పెంచే నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది. అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలో ఇండ్రస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పల్లె పేర్కొన్నారు. 

Don't Miss