ప్రధాని మోదీపై కన్హయ్య కుమార్ ప్రశంసలు..

17:15 - December 3, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రిపై ఎప్పుడూ విమర్శలు గుప్పించే జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌- మోదీని మెచ్చుకున్నారు. అమెరికా కొత్త రాష్ట్రపతి డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా ప్రధాని నరేంద్ర మోదే బెటరని కితాబిచ్చాడు. ముంబైలో జరిగిన టైమ్స్‌ లిస్ట్‌ ఫెస్ట్‌లో తాను రాసిన 'ఫ్రం బిహార్‌ టు తిహార్‌' పుస్తకంపై చర్చ సందర్భంగా కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేశాడు. మోదితో తనకు అభిప్రాయ భేదాలున్నప్పటికీ ట్రంప్‌ కన్నా ఎంతో మేలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా మహిళలు, ప్రవాసుల పట్ల ట్రంప్‌ ఉపయోగించిన భాష చాలా నీచంగా ఉందన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్హయ్యపై దేశద్రోహం కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.

Don't Miss