ప.బెంగాల్ లో ఆర్మీ మోహరింపుపై ఉభయసభల్లో గందరగోళం

11:44 - December 2, 2016

లోక్ సభ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపుపై ఉభయసభల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఆర్మీ మోహరింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్మీని ఎలా మోహరిస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప.బెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపుపై టీఎంసీ నిరసన వ్యక్తం చేస్తోంది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్మీని ఎలా పంపిస్తారని నిలదీశారు. దీనిపై రక్షణ మంత్రి పారికర్ సమాధానం చెప్పారు. నవంబర్ లో జరగాల్సిన తనిఖీలు కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా పడ్డాయన్నారు. ఆర్మీ ఎప్పటిలాగానే ఇలాంటివి తనిఖీలు చేస్తుంటాయని, కానీ ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని రక్షణ మంత్రి పారికర్ పేర్కొన్నారు. భారత్ సైన్యంపై ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ సభ్యుడు అనంతకుమార్ అన్నారు. రాజకీయం కోసం ఆర్మీని వాడుకోవడం సరికాదని చెప్పారు. ఆర్మీ మోహరింపుపై రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన కొసానగుతోంది. కోల్ కతాలో ఆర్మీ మోహరింపు సరికాదని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. దేశ శ్రేయస్సు, రక్షణ కోసం సైన్యం కృషి చేస్తోందని అన్నారు. సరిహద్దులో రక్షణ చేస్తున్న వారు ప్రాణత్యాగాలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో పలు ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఆర్మీ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. కానీ ఆర్మీపై పలు ఆరోపణలు రాలేదని, కానీ బెంగాల్ లో 21 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలను ఆర్మీ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సీఎం మమత బెనర్జీ నిరసన చేపట్టడం జరిగిందని, ఆర్మీ ఎందుకు మోహరించారో తెలపాలంటూ గత రాత్రి నుండి సచివాలయంలో సీఎం మమత బెనర్జీ ఉండడం జరిగిందని వివరించారు. బెంగాల్ లో శాంతిభద్రతలు సజావుగానే ఉన్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసమే ఈశాన్య రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టామని మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బెంగాల్ లో ఆర్మీ మోహరింపులో దురుద్దేశం లేదని చెప్పారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే బెంగాల్ లో ఆర్మీ బలగాలను మోహరించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప.బెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపు సరికాదని బీఎస్ పీ నాయకురాలు మాయావతి అన్నారు. 

 

Don't Miss