చర్చకు విపక్షాలే అడ్డు: మంత్రి అనంత్ కుమార్..

15:00 - December 1, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు తాము చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఏ నిబంధన ప్రకారం చర్చకైనా తాము సిద్ధమేనని, చర్చ అనంతరం ఓటింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై చాలా రోజులవుతున్నా ఎలాంటి చర్చ జరగకపోవడంపై కేంద్ర మంత్రి అనంతకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చర్చకు విపక్షాలే అడ్డు తగులుతున్నాయని, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సభ్యుల గందరగోళం మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.

Don't Miss