పేదల జీవితాల్లో మార్పు లేదు : తమ్మినేని

''సామాజిక న్యాయం...తెలంగాణ సమగ్రాభివృద్ధి', 'ప్రజా సమస్యల పరిష్కారం'.. లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్రను చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. 2150 కిలో.మీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 2016  అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈసందర్భంగా తమ్మినేని వీరభద్రంతో 10 టివి వన్ టు వన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదని.. టీఆర్ఎస్ చెప్పినట్లు లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మెరుగైన జీవితం లేదని తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు లేదన్నారు. తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నారో... తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అలాగే ఉన్నారని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో ఏలాంటి వెలుగులు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిస్వామ్యం నడుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ చట్ట విరుద్ధ పరిపాలన చేస్తున్నారని, చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనుమతి తీసుకున్న పాదయాత్రను సైతం అడ్డుకోండని, నిబంధనలను ఉల్లంఘంచి సీఎం పిలుపు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్ చేయాల్సిన పనులు కావని.. వాటికి ప్రజలు హర్షించరని తెలిపారు. సీపీఎంపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు, అవాక్కులు చవాక్కులు పేల్చుతున్నారని.. ఉన్మాదంలో ఉన్న కేసీఆర్ కు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. టీఆర్ ఎస్ లాంటి ప్రజావ్యతిరేక పార్టీల పాలనకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ముందుకు రావాలన్నారు. సామాజిక తెలంగాణ కోరుకునే శక్తులందరు ఏకతాటిపైకి రావాలని కోరారు. పాదయాత్ర సానుకూల ఫలితాలను ఇస్తుందన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
ఆశించిన విధంగా టీ.ప్రభుత్వ పాలన లేదు...
'సీపీఎం మహాజన పాదయాత్ర సందర్భంగా 82 రోజుల్లో, 2,150  కిమీ.సుదూర ప్రయాణంలో మాకు తెలిసింది ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదు. టీఆర్ఎస్ చెప్పినట్లు లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మెరుగైన జీవితం లేదని తెలిపారు. దళితుల పట్ల చిన్నచూపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం పరిష్కరించడం, ఇల్లు, తిండి, ఉపాధి, జీతం...ఇలాంటి కనీస సౌక్యఆలు నెవరేర్చడంలో అన్ని ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయి. ఆ బతుకు చిత్రం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలో కనపడుతుంది. కేసీఆర్ పాలనలో, గత రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రజల్లో బతుకుల్లో మార్పు లేదు. కుటుంబ, వ్యక్తిగత సమస్యల్లో ఏమాత్రం మార్పులేదు. సమాజానికి సంబంధించిన ఉమ్మడి సమస్యల్లో స్వల్పమైన మార్పు ఉండొచ్చు. 
తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే.. ప్రజలు బాగుపడాలి 
తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే.. రాష్ట్రంలోని ప్రజలు బాగుపడాలి. గతం కంటే మెరుగ్గా బతుకులు మారాలి. తెలంగాణ రాకముందు వచ్చాక ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. కూలీలు, రైతులు, నిరుద్యోగులు, వ్యవసాయదారులు, పేదల్లో ఎలాంటి మార్పులు లేదు. ఎక్కడ ఒక్క డబుల్ బెడ్ రూ ఇల్లు లేదు నిర్మించలేదు. ఎక్కడా మూడెకరాల భూమి పంచలేదు. 
కనీసం ఊరుకు ఒక ఉద్యోగం రాలేదు
ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామన్నారు. కనీసం ఊరుకు ఒక ఉద్యోగం రాలేదు. కాంట్రాక్టు ఉద్యగులను పర్మినెంట్ చేయలేదు. కనీస వేతనం అమలు చేయలేదు. కనీస వేతనం 18వేలు అమలు కావడం లేదు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. వారిని కార్మికులుగా గుర్తించడం లేదు. వారికి గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఏ ఒక్క విషయంలోనే ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరు. చాలా మందికి ఫించన్లు రావడం లేదు. సర్కార్ పై అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి. 
మిషన్ కాకతీయ పథకంలో అవినీతి..
మిషన్ కాకతీయ పథకం కాన్ సెప్టు మంచిది.. కానీ పథకంలో అవినీతి జరుగుతుంది. తెలంగాణ నీటి అవసరాలకు మిషన్ కాకతీయ మంచిది. కానీ మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గుంటలు తీసి వదిలివేశారు. చెరువుల్లోకి చుక్క నీరు రాలేదు. మిషన్ కాకతీయలో అవకతవకలు, అవినీతి పుష్కలంగా జరిగింది. ప్రజల బతుకు చిత్రం మారటం లేదు. ప్రజలకు కనీస అవసరాలైన తిండి, గూడు, అసరా ఉండాలి. ఉద్యోగం, వైద్యం ఉండాలని కోరుకున్నారు. తాము కోరుకున్న విధంగా తెలంగాణ.. లేదని ప్రజలు అనుకుంటున్నారు. 
వచ్చే తరాల కోసం పాదయాత్ర 
మేము చేసే పాదయాత్ర.. వచ్చే ఎన్నికలు కోసం కాదు.. వచ్చే తరాల కోసం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం.. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి... పేదలకు ఉచిత, వైద్యం రావాలి..అది ప్రభుత్వం రంగంలోనే ఉండాలి... 14 వేలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరు వేల స్కూళ్లను మూసివేశారు. విద్యాసంస్థలోకి ప్రైవేట్ శక్తులు వస్తే విద్యకు దూరం కావడమే జరుగుతుంది. సీఎం కేసీఆర్ చిన్న ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకం.... పెద్ద కార్పొరేట్ కు అనుకూలం. ప్రభుత్వం..ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. కొత్తగా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయడం లేదు. 
ప్రభుత్వంపై ఉన్న భ్రమలు అన్ని తొలగిపోతున్నాయి. పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు. మేము తీసుకున్న ఎజెండా అంటే సీఎం కేసీఆర్ కు భయం ఉంది. 
పాదయాత్ర చేపట్టాక... విజయాలు
పాదయాత్ర చేపట్టాక... సీఎం కేసీఆర్... మిషన్ భగీరథ పథకంలో భాగంగా దళితుల ఇళ్ల నుంచి మంచీ నీటి ప్రారంభించారు. బీసీ కమిషన్ వేశారు. మైనార్టీలకు సుధీర్ కమిషన్ వేశారు. పాదయాత్ర ప్రజల్లో చైతన్యం కలిగించింది.
ఇతర పద్దులను తగ్గించైన డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించాలి. వెనుకబడిన ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో గిరిజన, గోండు ప్రాంతాల్లో జ్వరం వస్తే ఇంజక్షన్ వేసే దిక్కులేదు. అడవి మీద గిరిజునుడికి హక్కు లేదని సీఎం కేసీఆర్ అన్నాడు. అది దారుణం.
రాష్ట్రంలో వ్యక్తిస్వామ్యం 
రాష్ట్రంలో వ్యక్తిస్వామ్యం నడుస్తోంది. చట్ట విరుద్ద పరిపాలన చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అనుమతి తీసుకున్న పాదయాత్రను సైతం అడ్డుకోండని నిబంధనలకు ఉల్లంఘంచి సీఎం పిలుపు ఇచ్చారు. ఉన్మాదంలో సీఎం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. టీఆర్ ఎస్ కు సీపీఎం ప్రత్యామ్నాయం శక్తిగా ఎదగాలి. సీపీఎం పెద్ద చరిత్ర కల్గిన పార్టీ. కొత్త భూసేకరణ చట్టం ఆమోదం పొందే అవకాశం లేదు. కేంద్రం ఆమోదం తెలిపే ప్రసక్తే లేదు. జిల్లాల విభజన అడ్డగోలుగా చేశారు. అభివృద్ధి చెందాలంటే జిల్లాలకు నిధులు, అధికారులు రావాలి. 
క్యాష్ లెస్ కాదు.. మైండ్ లెస్ చర్య...
పెద్ద నోట్ల రద్దు చేసి మోడీ ప్రజలను మోసం చేశాడు. క్యాష్ లెస్ కాదు.. మైండ్ లెస్ చర్య. రుణమాఫీపై రైతులు సంతృప్తిగా లేరు. ఒకే సారి రుణమాఫీ చేయాలి.
పాదయాత్రతో సానుకూల ఫలితాలు 
పాదయాత్రతో పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎక్కువగా ఉపయోగం జరుగుతుంది. పార్టీ బలంగా ఉన్నచోట్ల పాదయాత్ర గొప్పగా జరిగింది. గతంలో వర్గం మీద కేంద్రీకరించాం. కులంపై కేంద్రీకరించలేదు. మా తప్పును గుర్తించాం, అత్మవిమర్శ చేసుకుని...ఇప్పుడు కుల సమస్యపై కేంద్రీకరించాము. రాబోయే కాలంలో పోరాటలు ఉధృతంగా జరుగుతాయి. పాదయాత్ర సానుకూల ఫలితాలను ఇస్తుంది. 
వామపక్షాలే ప్రత్యామ్నాయం
ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ముందుకు రావాలి. సామాజిక తెలంగాణ కోరుకునే శక్తులందరు ఏకతాటిపైకి రావాలి. నేను ఆరోగ్యంగా ఉండి. చిరకాలం బతికి ప్రజలను సేవ చేయాలని ఉందని' అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

 

Don't Miss