కొనసాగుతున్న పెద్దనోట్ల రద్దు కష్టాలు

09:33 - December 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో  పెద్దనోట్ల రద్దు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 26 రోజులు గడుస్తున్నా నగదు కష్టాలు తీరడం లేదు. కరెన్సీ కోసం ఎటీఎంల ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారు. ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. డబ్బు పెట్టిన కొద్ది గంటల్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. చాలాచోట్ల నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎం సెంటర్లలో అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. పనిచేయని ఏటీఎంలతో జనం విసుగుచెందుతున్నారు. 2 వేల రూపాయల నోట్లకు చిల్లర దొరక్క.. నిత్యావసర సరుకులు కొనలేక.. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. పింఛన్‌దారులకు తిప్పలు తప్పడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss