ఒక్క చీరతో...

12:42 - December 6, 2016

సినిమా అంతా ఒక్క చీరతోనే ఆ హీరోయిన్ కనిపించనుంది. ఏం పాపం..డబ్బులు లేవా ? పెద్దనోట్లు రద్దు కష్టాలా ? ఏ హీరోయిన్ ఇలా చేస్తోంది ? అని అనుకుంటున్నారా మీరను అనుకున్నట్లు మాత్రం కాదులేండి..ఇందుకు ఓ కారణం ఉంది...

నయనతార..టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించింది. టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచిన ఈ తార గ్లామర్ తోనే కాక నటనతోనూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా తన కెరియర్ లో 55వ చిత్రంగా 'అరం' అనే సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇందులో 'నయన్' కలెక్టర్ పాత్రలో కనిపించబోతోంది. మొత్తం లేడీ ఓరియెంటెండ్ మూవీగా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం మొత్తం ఒకే ఒక చీరతో 'నయనతార' కనిపించనుందంట. ఈ సినిమాలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే కలెక్టర్ పాత్రలో నటిస్తోంది. అందుకే ఒకే కాస్ట్యూమ్ లో కనిపించనుందట. నీటి సదుపాయం లేని ఓ గ్రామానికి లేడీ కలెక్టర్ ఒక్క రోజులో నీరు ఎలా తెప్పించింది అన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'నయన్' మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించనుంది. మింజూర్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. 

Don't Miss