'గంగ'కాలుష్యంపై ఏం చేస్తున్నారు?..

08:33 - July 28, 2018

ఉత్తరప్రదేశ్ : గంగానది స్థితిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి యూపీలోని ఉన్నావ్‌ వరకూ గంగానదీ జలాలు తాగేందుకు, స్నానం చేసేందుకు ఎంతమాత్రం పనికిరావని స్పష్టం చేసింది. కలుషిత గంగ నీరు ఆరోగ్యంపై చూపే దుష్ర్పభావాల గురించి తెలియని సామాన్య ప్రజలు భక్తితో ఆ నీటిని తాగడం, స్నానం చేయడం చేస్తున్నారని పేర్కొంది. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమని పాకెట్లపై హెచ్చరికలుంటాయి. కాలుష్య జలాల్లో మునిగితే వచ్చే ప్రతికూల పర్యవసానాలపై ప్రజలను ఎందుకు హెచ్చరించరని ఎన్‌జీటీ ప్రశ్నించింది. గంగానదీ జలాలు ప్రజలు సేవించేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది తెలుపుతూ ప్రతి వంద కిలోమీటర్లకు డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని 'నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగ'ను ఎన్‌జిటి ఆదేశించింది.

Don't Miss