రేసు నుండి తప్పుకున్న 'నాగ్'...!

13:41 - December 1, 2016

హ్యట్రిక్స్ సక్సెస్ లతో 'నాగార్జున' ఫుల్ హ్యపీలో ఉన్నాడు. ఈ ఎడాది సంక్రాంతికి కానుక రిలీజైన సోగ్గాడే చిన్నినాయన విజయం ఈ రొమాంటిక్ కింగ్ కి మధురానుభూతినిచ్చింది. 50ప్లస్ లో 'నాగ్' 'సోగ్గాడి'గా యూత్ ని సైతం మెస్మరైజ్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇక 'ఊపిరి'తో మరో విజయం అందుకున్నాడు. 'నాగార్జున' రొమాంటిక్ స్టార్ గా ఎంత ఫేమ్ అయ్యాడో భక్తి చిత్రాలు చేసి అదే స్థాయిలో సక్సెస్ లు అందుకున్నాడు. 'అన్నమయ్య'గా, 'శ్రీరామదాసు'గా అద్భుత విజయాలు అందుకున్న 'నాగ్' ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ'తో మరోసారి అలాంటి విజయాన్ని పునరావృత్తం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడే 'నాగ్' ఆడియన్స్ చిన్నపాటి నిరాశ కలిగిస్తున్నాడు.

సంక్రాంతి..
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడంట. అయితే ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడం ఒక కారణం అయితే బెస్ట్ గ్రాఫిక్స్ అందించాలనేది మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో 'ఓం నమో వెంకటేశాయ' మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో 'అనుష్క ప్రగ్యా జైస్వాల్', 'విమలా రామన్' ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 

Don't Miss