నా పేరు సూర్య మూవీ రివ్వ్యూ ..

19:05 - May 4, 2018

తాను చేసే ప్రతి సినిమాలో తాను పోషించే ప్రతీ క్యారక్టర్ కి ప్రాణం పెట్టి పని చేసే అల్లు అర్జన్ నా పేరు సూర్య కోసం మేకోవర్ అయిన విధానంతోనే ఈ సినిమా టాక్ ఆప్ ఇండస్ట్రీగా నిలిచింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్, పేట్రియాట్రిక్ టచ్ ఉన్నాయని జరిగిన ప్రచారంతో ఈ సినిమా పై అందరిలో ఆసక్తి విపరీతంగా పెరిగింది. అలా భారీ అంచనాల నడుమ స్టైలీష్ స్టార్ అల్లూ అర్జన్, బ్లాక్ బాస్టర్ స్టోరీ రైటర్ వక్కంతం వంశీల కలయికలో రూపొందిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియ. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంతలా అంచనాలు రేకెత్తించిన అల్లూ అర్జున్ సూర్యగా సూపర్ అనిపించాడా...? వక్కంతం వంశీకి ఇది డ్రీమ్ డెభ్యూ మూవీగా నిలిచిందా..? ప్రొడ్యూసర్స్ కి కాసుల పంట పండించిందా లేదా..లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే.. ఆర్మీలో సోల్జర్ గా ఉంటూ.. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆర్మీ నుండి సస్పెండ్ అయ్యే పరిస్థితికి వస్తాడు సూర్య.. అయితే మాజీ ఆర్మీ ఆఫీసర్ అయిన తన గాడ్ ఫాదర్... కల్నల్ ను కన్విన్స్ చేయడంతో.. అతను ప్రముఖ సైకియార్టిస్ట్ అయిన రామ కృష్ణ రాజు సర్టిఫికేషన్ తీసుకుని రమ్మంటాడు.. అతడి దగ్గరకి వెళ్ళిన సూర్యాకి రామకృష్ణ రాజు 21 రోజులు టెస్ట్ లు పెడతాడు,ఆ టెస్ట్ ల్లో సూర్యా పాస్ అయ్యాడా లేదా. తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా లేదా. తిరిగి ఆర్మీలో రీజాయిన్ అవ్వాలని బోర్డర్ కెల్లాలనే తన కల నెరవేరిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..

నటీనటుల విషయానికి వస్తే..ఈ సినిమాకు ది బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఎసెట్ అల్లు అర్జున్ హీరోగా నటించడం. తాను ఏ క్యారక్టర్ చేసినా, ఆక్యారక్టర్ లో జీవించడం కోసం తనని తాను పూర్తిగా మార్చుకుని ఎంత కష్టానైన ఇస్టంగా భావించే బన్నీ.. సోల్జర్ రోల్ కోసం, తన బాడీ దగ్గర నుండి స్టైలింగ్ వరకు పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. కిల్లర్ బేసెప్స్ తో ఆర్మీ కట్టింగ్ తో సోల్జర్ బాడీ లాంగ్వేజ్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాంయింట్ గా నిలిచాడు.. సూర్య క్యార్టర్ ను అతను ఓన్ చేసుకున్న విధానం.. ఆశ్చర్యపరుస్తుంది.. ఫైట్స్ లో కూడా చెలరేగిపోయాడు బన్నీ.. కాని బన్నీ నుండి అందరూ ఎక్స్ పెక్ట్ చేసే డాన్స్ ల విషయంలో డిస్సపాయింట్ చేశాడు,, ఇరగా ఇరగా సాంగ్ లో కూడా మమా అనిపించే స్టెప్స్ తో సరిపెట్టాడు.. లవర్ ఆల్ సో.. ఫైటర్ ఆల్ సో సాంగ్ లో క్యాప్ ట్రిక్స్ మాత్రం బాగున్నాయి.. ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూరిటీ చూపించిన బన్నీ సీన్ కంటెన్ట్ లో డెప్త్ లేకపోవడంతో అవి అంతలా కనెక్ట్ కాలేదు,, హీరోయిన్ అనూ ఇమ్మాన్యూయెల్ యాక్టింగ్ పరంగా లిమెటెడ్ స్కొప్ ఉన్న క్యారక్టర్ లో నాచ్యూరల్ పర్ఫామెన్స్ ఇచ్చింది.. ఆమె లుక్స్ బాగున్నాయి.. ఇక అల్లు అర్జున్ తరువాత సినిమాకు మరో్ మెయిన్ పిల్లర్ గా నిలిచాడు సీనియర్ అర్జున్. అల్లు అర్జున్ ఫాదర్ క్యారక్టర్ లో.. సైకాలజీ ఫ్రోఫిసర్ గా సటిల్ పర్ఫామెన్స్ తో అలరించాడు. అర్జున్ చేయడం వల్లే ఆ క్యారక్టర్ కి.. సినిమాకు..అంత వెయిట్ వచ్చింది.. ఈ వయస్సులో కూడా స్టైలింగ్ పరంగా స్క్రీన్ ప్రజన్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నాడు,, కొన్ని కొన్ని ఎక్స్ ప్రషన్స్ అర్జున్ ఎలాంటి యాక్టరో మరోసారి గుర్తు చేశాయి.. నదియా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ గాని ఇంపాక్ట్ గాని లేదు.. జస్ట్ స్టార్ కాస్ట్ కోసం యాడ్ చేసినట్టుంది.. ఇక విలన్ క్యారక్టర్ లో కనిపించిన శరత్ కుమార్ చేసిన చల్లా పాత్ర రొటీన్ కమర్షియల్ ఫార్మట్ విలన్ లానే కనిపించింది.. ఆ క్యారక్టర్ వరకూ ఎలాంటి స్పెషాలిటీ లేదు.. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు తన మార్క్ మెనరిజమ్స్ తో.. సింపుల్ పంచ్ డైలాగ్స్ తో ఉన్నంత సేపు నవ్వులు పూయించాడు.. పోసాని, ప్రదీప్ రావత్, రావు రమేష్, బోమన్ ఇరాని, సాయి కుమార్, అనూక్ సింగ్ ఠాకూర్, అంతా కూడా క్యారక్టర్స్ పరిది మేరా.. పర్ఫామెన్స్ ఇస్తూ.. సినిమాకు ప్లస్ అయ్యారు...
 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి బ్లక్ బస్టర్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ, ఈసినిమాకు ఎన్నుకున్న యాంగర్ మేనేజ్ మెంట్ అనే సెంట్రల్ పాయింట్ బాగుంది. ఆర్మీ బ్యాగ్ డ్రాప్ ఆడ్ చేస్తూ. దాన్నివిస్తరించిని విధానం కూడా బాగుంది.. కాకపోతే ఆర్మీకి ఉండే రూల్స్ ను కొన్ని లాజిక్స్ ని కమర్షియల్ వైబులిటీ కోసం పూర్తిగా పక్కన పెట్టేశాడు.. ముఖ్యంగా సూర్య పోలీసులను కొట్టడం.. అతను కొన్నిచోట్ల వాడిన వల్గర్ ల్యాంగ్ వేజ్... బోర్డర్ ను లింక్ చేస్తూ నడిపించిన డబుల్ మీనింగ్ డైలాగ్ సీన్ వంటివి.. సినిమా స్థాయిని తగ్గించాయి. మంచి కథకు కొన్ని అనవసరమైన కొనసాగింపులు ఎక్కువ కమర్షియల్ అంశాల టచ్చప్ వల్ల, ఇంపాక్ట్ తగ్గింది.క్లైమాక్స్అయిపోయిన తరువాత కొనసాగింపు గా వచ్చిన అన్వర్ సీన్ఎలివేట్ కాలేదు. డైలాగ్స్ పరంగా తన మార్క్ చూపించ గలిగాడు వంశీ. డైరక్టర్ గా మొదటి సినిమా అయినప్పటికి.. చాలా బాగా హ్యాండిల్ చేశాడు, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఎడిషన్ వంశీకి ప్లస్ అయ్యింది.. మొదటి సినిమా కాబట్టి డైరక్టర్ గా చాలా వరకూ సక్సెస్ అయినట్టే..ఈ సినిమాకు హైలెట్స్ గా నిలిచిన యాక్షన్ కంపోజర్స్ రామ్ లక్ష్మన్ కు స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి ఆ రేంజ్ లో ఫైట్స్ కంపోజ్ చేశారు..ఇక కెమేరా మెన్ రాజీవ్ రవి. ఈ సినిమాలో తన మ్యాజిక్ చూపించాడు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా, ఎట్రాక్టీవ్ గా, మలచడంలో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాడు.. అతను వాడిన కలర్ గ్రేడింగ్ టింట్ మూవీకి.. క్లాస్ లుక్ తెచ్చాయి.. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ అయిన విశాల్,శేఖర్ ఈ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనిపిస్తుంది. రెండు పాటలు నాలుగైదు సీన్లు, ఆర్ ఆర్ తప్ప, మిగిలిన మ్యూజిక్ అంతా నార్మల్ స్టాండెడ్స్ లో ఉంది.. సూర్య క్యారక్టర్ కి ఇచ్చిన సిగ్నేచర్ ఆర్ ఆర్ బాగుంది.. గౌతమ్ రాజు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్ధాయిని పెంచాయి..

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే. మచ్ ఎవేటెడ్ మూవీ ఆఫ్ సమ్మర్ గా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ముందు నుండి చెపుతున్నట్టు.. పేట్రియాట్రిక్ కంటెంట్ తో ఉన్నప్పటికీ మిగితా కమర్షియల్ ఎలిమెంట్స్ గుమ్మరించడం వలన దాని ప్రత్యేకత నిలుపుకోలేక పోయింది. అయితే సెంట్రల్ పాయింట్, అల్లూ అర్జున్ పర్ఫామెన్స్, ఫైట్స్ , డైలాగ్స్ వల్ల అన్నీ సెంటర్స్ లోనూ సర్వేవ్ అయ్యే కంటెంట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...

ప్లస్ పాయింట్స్

అల్లు అర్జున్ మేకోవర్

సెంట్రల్ స్టోరీ

ఫైట్స్, డైలాగ్స్

సినిమాటోగ్రాఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

ఇంపాక్ట్ లేని ఆర్మీ బ్యాక్ డ్రాప్

ఫస్ట్ ఆఫ్ గ్రాఫ్

సెంకండ్ ఆఫ్ లాగ్స్..

ఎలివేట్ కాని ఎమోషన్స్

రెంజ్ తగ్గిన మ్యూజిక్

Don't Miss