పోలవరానికి నాబార్డ్ నిధులు : మంత్రి సుజనా

21:40 - December 1, 2016

ఢిల్లీ : ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఇకపై వేగవంతం కానున్నాయి. నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇక స్పీడప్‌ కానున్నాయి. నిధుల మంజూరీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలివిడతగా 2వేల 981 కోట్ల రూపాయలకు ఆమోదం తెలుపుతూ..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతకం చేశారు. ఈ మేరకు ఆర్థికశాఖ కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం పంపింది. ఈ నిధులు నాబార్డు నుంచి మూడు రోజుల్లో విడుదలవుతాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరీ పేర్కొన్నారు. ప్రాజెక్టు పని వేగాన్ని ఆధారంగా విడతల వారీగా నిధులు మంజూరవుతాయని తెలిపారు. నాబార్డు నుంచి ప్రాజెక్టుకు నేరుగా నిధులొస్తాయని అనంతరం కేంద్ర ప్రభుత్వం నాబార్డుకు ఆ నిధులను చెల్లిస్తుందని వెల్లడించారు. 

Don't Miss