డ్యాన్సర్ ను కాల్చి చంపాడు..వీడియో..

17:19 - December 4, 2016

పంజాబ్ : తనతో డ్యాన్స్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఓ డ్యాన్సర్ ను ఓ తాగుబోతు కాల్చి చంపాడు. ఈ ఘటన భటిండాలో చోటు చేసుకుంది. వివాహ వేడుకలు..ఇతరత్రా వేడుకల్లో డ్యాన్సులు చేసుకుంటూ కొందరు జీవనం సాగిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే భటిండాలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. అందులో డ్యాన్సర్లు ఆడుతున్నారు. తనతో డ్యాన్స్ చేయలేదన్న కారణంతో ఓ తాగుబోతు వివక్ష కోల్పోయాడు. వెంటనే తనదగ్గరున్న తుపాకితో కాల్పులు జరిపాడు. దీనితో ఆ డ్యాన్సర్ ఆడుతూ అక్కడికక్కడనే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Don't Miss