మల్లన్న ముచ్చట్లు

Wednesday, December 13, 2017 - 20:59

అడుక్క తినెటోనికి హక్కులెందుకు..? బనిసగ బత్కనేర్చినోనికి బర్గెలెందుకు..? బహుజన ప్రజలరా..? ఈ మాట ఎందుకు అంటున్న అంటే..? తెల్గు రాష్ట్రాలళ్ల బీసీల మీద అయితున్న గోసను జూడలేక చెప్తున్న.. అటు అధికారం మీ చేతికి అందదు.. ఇటు రాజకీయ రిజర్వేషన్ ఇయ్యరు.. ఎంతసేపు ఓటు అనే గొర్లుగనే బీసీలను జూస్తున్నరు నాయకులు.. ఈ బీసీలళ్లనే కొంతమంది చెంచాగాళ్లు మోపై.. వాళ్ల జనాన్నే ఆగం జేస్తున్నరు.....

Tuesday, December 12, 2017 - 20:38

అమ్మా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభమ్మా..? మందికేనా మీరు నీతులు జెప్పేది లేకపోతె మీరు గూడ ఏమన్న పాటించేది ఉంటదా..? మీ ముఖ్యమంత్రిగారు ఇట్లనే జెప్పిండా..? మీరు గెల్వంగనే.. వాన్ని తన్నుండ్రి.. వీన్ని దన్నుండ్రి.. ఎదురుదిర్గినోన్ని గెదిమికొట్టుండ్రి.. ప్రజలని గూడ జూడకుండ్రి అని చెప్పిండా ఎట్ల..? ఎట్లాని గొట్టినవ్ టోల్ గోళ్లను..? ఏం కథ..?

ప్రజలను గల్వలేనంత బిజీగున్నరా...

Monday, December 11, 2017 - 20:26

మంద క్రిష్ణ మాదిగ.. లక్షలాది మంది ఉద్యమకారులకు దశ దిశా నిర్దేశం జేశి గుండె ధైర్యం నింపిన వ్యక్తి ఆయన.. అందరికి గుండె ధైర్యం జెప్పె మంద క్రిష్ణ మాదిగ.. కన్నీళ్లు వెట్టిండు.. రెండున్నరేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం జేశిన కుట్రను బైటవెట్టి కనీళ్లు గాల్చిండు.. మంద క్రిష్ణ మాదిగను సంపెతందుకు సర్కారు ఏశిన కుట్రను మొట్టమొదటి సారిగ చెప్పిండు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంప...

Friday, December 8, 2017 - 21:14

చంద్రాలు ఆస్తులు ప్రకటించిన లోకేశం, కొండ పోచమ్మ కాడ హరీష్ రావు దండు...హరీష్ రావు యువసేన దాష్టీకం, ఫార్మా సిటీ మాకొద్దంటున్న జనాలు, ఎమ్మెల్యే గొంగిడి సునితకు సుక్కలు, ఇండియా జైళ్ల మీద అల్గుతున్న మాల్య.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

Thursday, December 7, 2017 - 20:33

కాళేశ్వరం కట్టు కథలిప్పిన మల్లన్న, కడియం శ్రీహరిని ఓడించిన విద్యార్థిని, బహుజనుల విభజనలో చంద్రులు బిజీ, మిడ్ మానేరు కట్టమీదికెక్కిన బాధితులు, పాయకాన్ల పైసలు పంచుకతిన్నరు, శశిభూషణ్ శర్మపై కేసు నమోదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Wednesday, December 6, 2017 - 20:28

బాబా సాహెబ్‌ను మరిచిన బాతాల పోశెట్టి, సర్కారు టీచర్లు బడికి సక్కగవోతలేరట, డబుల్ బెడ్రూం ఇండ్ల కాడ డ్రామాలు, రాజకీయం గాదిది.. రాజాకార్లు గారు మీరు, గుండ్ల గూడెంల దిగిన గుర్రం బాబా, తల్లిని చెట్టుకింద వదిలేసిన    కన్నకొడుకులు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

 

Tuesday, December 5, 2017 - 20:27

జేఏసీ సభ మీద విచిత్ర వార్తలు, ముప్పైవేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం, ఉస్మానియా యూనివర్సీల యుద్దం, గురిగింజ నీతులు జెప్తున్న జగనాలు, బీసీల నడ్మ పంచాది వెట్టిన చంద్రులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Saturday, December 2, 2017 - 20:16

తంబూలాలిచ్చేశ్నం తన్నుక సావుండ్రి.. అన్నట్టున్నది.. అటు చంద్రాలు..కొల్వులకై కొట్లాట సభ గట్టిగనే జేస్తట్టున్నరుగదా తెలంగాణ జేఏసోళ్లు..ఆర్ఎస్ఎస్ గూండాలు.. బీజేపీ అగ్రవర్ణ శాల్తీలు.. తెలంగాణ పోలీసులు.. ఉమ్మడిగా నిర్మించిన అభాంగపట్నం సీన్మ ట్రైలర్ రిలీజైంది.. నిన్న మన ముచ్చట్లళ్ల జెప్పుకోలేదా.. ఒక టీవీ ఛానెళ్ల గూసోని ఒక దొంగ డాక్టర్ గాడు..చెప్పేటియి శ్రీరంగ నీతులు.. దూరేటియి...

Saturday, December 2, 2017 - 20:14

ఆర్ఎస్ఎస్ గూండాలు.. బీజేపీ అగ్రవర్ణ శాల్తీలు.. తెలంగాణ పోలీసులు.. ఉమ్మడిగా నిర్మించిన అభాంగపట్నం సీన్మ ట్రైలర్ రిలీజైంది.. ఆర్ఎస్ఎస్ భరత్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో.. కమలం బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం దళిత బహుజన ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్నది.. చిత్రంలో ప్రాథాన పాత్రలో నటించిన దళితులు విజయోత్సవ సభలు ముగించుకోని అభంగపట్నం జేరుకున్నరు.. గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్...

Friday, December 1, 2017 - 20:21

అరే ఈ తెలంగాణలున్న ప్రతిపక్షాలోళ్లకు ఏం పనిలేనట్టుందివా..? టీఆర్ఎస్ నాయకుడు బస్టాండ్ జాగను కబ్జావెట్టిండు అంటె.. పెట్టడా మరి..? ప్రభుత్వం చర్యలు దీస్కోవాలె ఆయన మీద అని బోధన్ కాడ అఖిలపక్షం నాయకులు డిమాండ్ జేస్తున్నరట.. అరే నాయన.. కబ్జావెట్టినోడే సర్కారు మన్షాయే ఇగ మీకు ఏం జెప్పాలే చెప్పుండ్రి..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Friday, December 1, 2017 - 19:33

అరే నాయనా..? తెలంగాణ సర్కారోళ్లు.. జర్ర మీరీ డ్రామాలు బంజేయుండ్రిరా నాయనా..? బ్రహ్మదలిస్తె ఆవుసుకు కొద్వనా..? మొగడు తలిస్తె దెబ్బలకు కొద్వనా..?..అంబర్ పేట అన్మంతన్న ఉన్నతాన ఉండెతట్టు లేడుగదా..? అరే నాయన ఎటువోతున్నదిరో లోకము.? డాక్టర్ టీవీ స్టూడియోల గూసుంటడు.. పేషెంట్ ఇంటికాడుంటది.. అరే గాంధీ తాతకు అప్పట్ల బుర్ర ఎల్గనట్టుందిగని.. గంగెద్దు కింద వన్నడు గద్దరన్న.. తన్ను...

Thursday, November 30, 2017 - 20:23

జీహెచ్ఎంసీ అధికారులకు ధమ్ముంటే.. ఆడ శీన్మ నటుడు అక్కినేని నాగార్జున అనె దొంగ.. కబ్జాకోర్.. ఎన్ కన్వెన్షన్ కాడ కబ్జావెట్టిండు.. చెర్వు శిఖం భూమిని ఆక్రమించిండు.. మన అధికారులకు ధమ్ముంటే వాడు గట్టుకున్న దాన్ని కూలగొట్టి చెర్వు శిఖం భూమిని చెర ఇడ్పియ్యమనుండ్రి సూద్దాం.. అదే పేదోడు ఎవ్వడన్న ఇంచు భూమి అటీటు జర్గితె వాని ఇంటికి జేసీబీలు సూటివెడ్తరు..పూర్తి ముచ్చట కోసం వీడియో...

Thursday, November 30, 2017 - 20:18

అరే నాయనా ఈ బట్టెవాయి మాటలు ఇంటుంటే.. అవద్దాలే ఆత్మహత్య జేస్కోని సచ్చిపోతయా ఎట్ల అనిపిస్తున్నది.... అమ్మా దేవనపల్లి దొరసాని.. అలియాస్ కల్వకుంట్ల కవితగారు.. మీరు తక్షణమే రాజీనామా జేయాల్నంట.. మొన్ననే కండువా మార్చి తెల్గుదేశంల జేరిన ఎమ్మెల్యే మేడం ఉన్నదిగదా..? గిడ్డి ఈశ్వరీ మేడం.. అగో ఆమే ఏమంటున్నదంటే...ఆ తెలంగాణలున్న బీసీ ప్రజలారా.?? మీరు అసలైన సర్కాసు జూశే యాళ్లైంది.....

Tuesday, November 28, 2017 - 21:44

హైద్రావాదుకు మెట్రో రైలొచ్చుడు మా పుణ్యమే, అడ్డగొలుగా హామీలిస్తున్న జగనాలు, ఎక్కింది సైకిల్.. తిప్పేదే ఫ్యాను, నగర మేయర్ కు అవమానం, బెయిల్ మీద బయటకొచ్చిన గాడ్ధులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Monday, November 27, 2017 - 20:23

తెలంగాణల న్యాయం నాల్గు పాదల మీద నడుస్తున్నదని చెప్తడు మన బాతాల పోశెట్టిగారు.. మరి ఏ పాదం మీద చటాక్ న్యాయం గనిపిస్తలేదు.. అసలు తెలంగాణల న్యాయం అనేది ఉన్నదా..? ఉంటె మరి..? నిజామాబాద్ భరత్ రెడ్డిగాని అరెస్టు ఏమాయే..? ఇయ్యాళటికి వారం పదిరోజులు దాటిపాయే.. ఇప్పటికి వాన్ని అరెస్టు జేయలేదంటే ఏందన్నట్టు మత్లావు..?

ఎద్క తెలంగాణ రాష్ట్రంల శితం సచ్చిపోతున్నరుగదా రైతులు.. మనకేమో...

Saturday, November 25, 2017 - 20:15

సొచ్చెదాక రామారావు.. సొచ్చినంక సోమారావు.. మన కేసీఆర్ మాటలు ఇట్లనే ఉంటయ్.. ఎన్కటికి ఒకడు ఏం జేశిండట.. ఒకామె ఏడుస్తుంటే.. ఎందుకేడుస్తున్నవ్ తల్లీ అన్నడట.. మా భర్త గొట్టిండు అని చెప్తదట.. అయ్యో వాని చేతులిర్గిపోను భార్యను గొడ్తడా అని తిట్టి.. ఇంటికి వొయ్యిండట.. ఏమైంది గింత ఆల్చమైంది అంటే.. నన్నే అడ్గుతావే అని ఇంటికాడ భార్యను వీడు గూడ గొట్టిండట.. ఈ ముచ్చట ఎందుకంటె.. సూడుండ్రి...

Friday, November 24, 2017 - 20:40

నేను గప్పుడు జెప్పలేదా... ఇది కొల్వులు భర్తీ జేశే ప్రభుత్వం గాదు కోతల ప్రభుత్వమే అని... అన్నట్టే అయ్యింది.. ముప్పై ఒక్క జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఏస్తున్నమని మొన్న టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు నోటిఫికేషన్ ఏశిండ్రుగదా... సర్కారును హైకోర్టు దౌడమీదికెళ్లి గొట్టినంత పనిజేశింది.. మీ ముప్పై ఒక్క జిల్లాలకు కేంద్రంల గుర్తింపే లేదు ఏట్ల ఏస్తవయ్యా.. చల్ పది జిల్లాల లెక్క మీదికెళ్లే...

Thursday, November 23, 2017 - 20:25

రేవంత్ రెడ్డికి ధమ్ముంటే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అంద జేయాలే అంటున్నడు.. పోరాట యోధుడు శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డిగారు.. సరే ప్రభుత్వ భూముల పల్లాగారూ.. రేవంత్ రెడ్డికి నిజంగనే ధమ్ములేక తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇస్తలేడనుకుందాం.. మరి ధమ్మున్న మీరు.. బైటి పార్టీల కెళ్లి వచ్చి మీదాంట్లె జేరినోళ్ల రాజీనామాలు ఆమోదం జేపియ్యరాదుండ్రి సూద్దాం..

యాదగిరి గుట్టదిక్కు...

Wednesday, November 22, 2017 - 20:22

లంచం ఇయ్యలేదని ఒక డ్రైవర్‌ను గొట్టిండ్రట ఆబిడ్సు కాడ ఇద్దరు కానిస్టేబుళ్లు.. దెబ్బలు తిన్న ఆ డ్రైవర్ దావఖాండ్ల వడ్డడు.. నిన్న రాత్రి హైద్రావాదుల అయిన ఈ ముచ్చట మీద ఫేస్ బుక్, వాట్సప్‌ల జనం తక్వ తిడ్తలేరు ఆ కానిస్టేబుళ్లను.. అన్నం తింటున్నరా..? కడ్పుకు ఇంకేమన్న రోత తింటున్నర్రా అని కన్నమ్మ మాటలంటున్నరు..పోలీసోడు గెట్ల కొట్టాడో..డ్రైవరన్న ఏం అంటున్నడో వీడియోలో చూడండి...

Wednesday, November 22, 2017 - 20:08

ఏడనన్న శాంతి చర్చలుంటే.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే వంపాలే బాగ మల్పుకొస్తడు.. పాడుగాను.. ఎట్లమాట్లాడాల్నో గూడ తెల్వది ఏడంగ ఎమ్మెల్యే ఆయెనే ఏమో అని జనం అనుకుంటున్నరంటే ఇగ ఎమ్మెల్యేగారి శిగ్గు ఏమున్నది సూడుండ్రి.. బోడుప్పల్ కాడ సంగీత అనే బుజ్జి అత్తగారింటి ముంగట ధర్నా జేస్తున్నదిగదా... ఆడికి వొయ్యి ఆడోళ్లతోని తిట్లువడ్డడు ఎమ్మెల్యే..మరి మీరు సూడాలంటే వీడియో క్లిక్...

Wednesday, November 22, 2017 - 20:04

అంబేద్కర్ అంటె.. కాళ్లు గడ్గి నెత్తిల సల్లుకుంటం అన్నంత యాక్టింగ్ జేస్తరు మన బాతాల పోశెట్టి ఇంటి బ్యాచ్.. దేవుండ్లకు సమర్పించుకున్న మొక్కులు సంగతి అట్లుండంగ.. జనగామా ఎమ్మెల్యే చెర్వు భూమిని కబ్జావెడ్తె ఆయన మీద చర్యలు దీస్కోలేదు.. ఏడనన్న శాంతి చర్చలుంటే.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే వంపాలే..చంద్రబాబు ఏక్ నంబర్ మోసగాడు.. అని చెప్పెతందుకు పెద్ద కష్టపడవల్సిన పనేం ఉండది.....

Tuesday, November 21, 2017 - 20:09

బాతాల పోశెట్టి కొడ్కు అజయ్ జెప్పింది మనం ఇనాల్నంటగని.. మనం జెప్పేది మాత్రం ఆయన ఇనడంట.. ఇయ్యాళ మంత్రి కేటీఆర్ గారు నాయిని నర్సన్న ఉమ్మాయ జక్కాయ అంత జీహెచ్ఎంసీల ఏదో పనిమీద దిర్గినట్టుండ్రు.. ఒక తాన నిరుద్యోగులు సద్వుకునె జాగుంటే ఆడికి వొయ్యి ఏదో జెప్పవోతె నిరుద్యోగి ఊకుంటడా..? గీ ముచ్చట సూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, November 21, 2017 - 20:02

జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నువ్వు రాజీనామా జేయాల్సిన యాళ్లైంది వా...ఈ కమ్మకులమోళ్లంత కూసోని పంచుకున్న నంది అవార్డు నాకు పొరపాటుననే వచ్చింది.. బాతాల పోశెట్టి కొడ్కు అజయ్ జెప్పింది మనం ఇనాల్నంటగని.. మనం జెప్పేది మాత్రం ఆయన ఇనడంట..హురక తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్లు అప్పుడే ఎన్నికల మేనిఫెస్టో ఇడ్దల జేశినట్టున్నరుగదా..? మన బాతాల పోశెట్టి మందిని జూడంగనే గడ్కోపారి...

Monday, November 20, 2017 - 20:29

భారతదేశంల ఎట్లుంటదంటే యవ్వారం.. సాకలాయిన కొడ్కు బట్టలే ఉత్కి బత్కాలే.. మంగళాయిన కొడ్కు సగురం జేస్కోనే బత్కాలే.. గొల్లాయిన కొడ్కు గొర్లే గాశి బత్కాలే.. రాజకీయ నాయకుల కొడ్కులు రాజకీయం జేశి బత్కాలే..? ఈమాట ఎందుకంటె.. ఢిల్లీ పార్టీల కెళ్లి గల్లీ పార్టీల దాక జూడుండ్రి.. రాజకీయ వారసత్వం కథ ఎట్లుంటదో..

ఒకసారి ఒకమాట.. ఇంకో సారి ఇంకోమాట మాట్లాడెటోళ్లను ఏమంటరు మన తెలంగాణ భాషల...

Saturday, November 18, 2017 - 21:16

కొల్వులకై కొట్లాటకు సిద్దంగున్న జేఏసీ, కొత్త రాజకీయం సుర్వైందన్న చంద్రాలు, కలెక్టరేట్ ఆఫీస్ ముంగట టెన్ టీవీ నిఘా, నల్లగొండకు తమ్ముని లెక్కైన మరో జిల్లా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Friday, November 17, 2017 - 19:52

నేనేమన్న పిచ్చిదాన్నా..? అంటున్నది తెల్గుదేశం పార్టీ నాయకురాలు.. ఉమామాధవరెడ్డి.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఉమామేడం మీరు పిచ్చోళ్లు గదా అని ఏ విలేకరన్న అడ్గిండా ఎట్ల..? ఆయనకెందుకు డౌటొచ్చింది.. ఈమెందుకు ఇట్లన్నది అనేది జర్ర ముచ్చట లోపటికి వొయ్యి సూస్తె మత్లావు అర్థమైతది..

నంది అవార్డుల పంచాది మనదాక ఎర్కైందంటే.. ఆడ ఏదో కథ ఉన్నట్టే అనిపిస్తున్నది.. నందమూరి బాలికాకయ్య...

Friday, November 17, 2017 - 07:51

ఈత నేర్చిన చాప ఏ చెర్లైనా ఈతగొడ్తది.. అంతేనా..? మరి ఒక పార్టీనుంచి జంపుగొట్టినోళ్లు ఇంకో పార్టీలకు గూడ కొట్టరన్న గ్యారంటి ఏంది..?ఒకప్పుడు మీడియాను జూస్తె ప్రభుత్వాలు భయపడేటియట.. ఇప్పుడు తెలంగాణల ప్రభుత్వాన్ని జూశి మీడియా భయపడ్తున్నదంటున్నడు అంబర్‌పేట అన్మంతన్న...తెలంగాణల మాదిగల మీద మళ్లొక కుట్ర సుర్వైందా..?తెలంగాణల విద్యార్థులంత కేసీఆర్ ఎంటనే నడ్వాలనుకుంటున్నరట.....

Pages

Don't Miss