పీవీపీకి 'మహేష్' షాక్..!

13:03 - December 2, 2016

పీవీపీ..మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాలు నిర్మితమయ్యాయి. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాణంలో 'బ్రహ్మోత్సవం' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే నిర్మాత ప్రసాద్ వి పొట్లూరితో మరో సినిమా చేసేందుకు 'మహేష్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వెల్లువడ్డాయి. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పొస్టర్ పై 'మహేష్' స్పందించలేదు. తాజాగా పీవీపీ సంస్థ 'మహేష్' తో నిర్మించాల్సిన సినిమా మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' బిగ్ హిట్ అందించిన 'దిల్' రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్టు రూపొందుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం 'మహేష్' కోసం కథను తయారు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రిన్స్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే 'కొరటాల' శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేష్ అంగీకరించినట్లు టాక్. వీటి గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Don't Miss