సీఎంగా 'మహేష్ బాబు'..

12:23 - December 8, 2016

ఏంటీ ముఖ్యమంత్రిగా 'మహేష్ బాబు'..అని ఆశ్చర్యపోతున్నారా ? రియల్ లైఫ్ లో కాదు లెండి..రీల్ లైఫ్ లో.. ఇప్పటికే ఆయన సీఎంగా నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అనంతరం 'మహేష్ బాబు' ఆచూతూచి అడుగేస్తున్నారు. ప్రాధాన్యత గల అంశాలను ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'మహేష్' ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామానాయుడు స్టూడియోలో ఎలాంటి హంగామా లేకుండా ఈ మూవీ ముహుర్తం సింపుల్ గా కానిచ్చేశారు. మహేష్ తో తను చేయనున్న కొత్త మూవీ తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రమవుతుందని కొరటాల చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజకీయాల నేఫథ్యంలో నడుస్తుందని టాక్. 'భరత్ అను నేను' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు మూవీ స్టోరీ లైన్ మార్చేస్తుందని ఈ దర్శకుడు మరో హాట్ కామెంట్ చేశాడు. దీనితో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే 'మహేష్' ముఖ్యమంత్రిగా కనబడుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే ఒకవేళ నిజమైతే రీల్ లైఫ్ లో సీఎంగా 'ప్రిన్స్' ఎలా నటించాడోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 100కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది.

Don't Miss