లూపస్ వ్యాధి గురించి తెలుసా ?

07:05 - May 11, 2018

హైదరాబాద్ : లూపస్‌... ఇదో అంతు చిక్కని జబ్బు.. ఎందుకొచ్చింది.. ఎలా వచ్చిందో కూడా తెలుసుకోలేని మాయదారి రోగం. పూర్తిగా నివారణ లేని... ఈ ప్రాణాంతక లూపస్‌ డిసీజ్‌పై టెన్‌టీవీ కథనం..మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే లూపస్‌ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇది రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఒకరిద్దరిలో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. కేవలం ఒక్క నిమ్స్‌ ఆసుపత్రిలోనే సుమారు రెండున్నర వేలకు పైగా లూపస్‌ వ్యాధిగ్రస్తులు వైద్యులను సంప్రదిస్తున్నారంటే.. దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
లూపస్‌ వ్యాధి నేరుగా శరీరంలోని అవయవాలకు హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, గుండెపైన ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. 15 నుంచి 35 ఏళ్ల మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాగా మగవారిలో పదిశాతం మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటాయి. రెండు వారాలకు పైగా విపరీతమైన జ్వరం, నోట్లో పొక్కులు, చర్మంపై ఎర్ర మచ్చలు, చిన్నవయసులోనే కీళ్ళ నొప్పులు రావడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని లూపస్‌ వ్యాధి గుర్తించాలంటున్నారు వైద్యులు. రుమటాలజిస్ట్‌ను కానీ, ఫిజిషియన్‌ కానీను సంప్రదించాలని సూచిస్తున్నారు. లూపస్‌ రావడానికి జెనిటిక్‌ కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం, ఎక్కువగా ఎండలో ఉండే వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Don't Miss