రైజింగ్ లో క్తీరి సురేష్...

13:04 - December 1, 2016

'నేను శైలజ' మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన 'కీర్తి'కి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తరువాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఓమ్లీ బ్యూటీ 'నాని'తో 'నేను లోకల్' మూవీ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే కేవలం రెండు సినిమాలతోనే 'కీర్తీ' టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నట్లు వినికిడి. హీరోయిన్ గా 'కీర్తి సురేష్' రైజింగ్ లో వుంది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫస్ట్ ఛాయిస్ 'కీర్తి'కే ఇస్తున్నారు.

గ్లామరస్..
తన తోటి హీరోయిన్లు లిమిట్ లేకుండా గ్లామరస్ గా కనిపించడానికి రెడీ అంటే 'కీర్తి' మాత్రం గ్లామర్ విషయంలో లిమిట్ దాటడం లేదు. అయినా సరే 'కీర్తి'ని క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. తమిళ్ లో కూడా 'కీర్తి సురేష్' హవా మొదలైంది. అక్కడ కూడా టాప్ హీరోలతో జత కడుతోంది. 'విజయ్' తో 'భైరవ' ఫినిష్ చేసిన ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ 'సూర్య', 'కార్తీ'లతో నటించే ఛాన్స్ అందుకుంది. 'సింగం' తరువాత 'సూర్య' చేయబోయే కొత్త సినిమాలో ఈ చెన్నై చిన్నదాన్ని హీరోయిన్ తీసుకున్నారు. ఇక 'సూర్య', తమ్ముడు 'కార్తీ' కొత్త సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మొత్తానికి సౌత్ న్యూ స్టార్ హీరోయిన్ 'కీర్తి సురేష్' కీర్తీ వెలిగిపోనుంది.

Don't Miss