మాటలకందని విషాదం:20 మంది మృతి

15:30 - April 21, 2017

మాటలకందని విషాదం:25 మంది మృతి

చిత్తూరు: జిల్లాలోని ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిలో ఏర్పేడు పోలీసు స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ విద్యుత్‌ స్తంబాన్ని ఢీకొట్టి... దుకాణాల్లోకి దూసుకుపోవడంతో ఎక్కువమంది మృత్యువాత పడ్డారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.. వీరిని చికిత్సకోసం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పూతలపట్టు-నాయుడుపేట మార్గంలో వాహనాలరాకపోకలు స్తంభించాయి. వివరాల్లోకి వెళితే....మోదుగుపాలెం రైతులు తమ ప్రాంతంలో గత కొన్ని ఏళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని వాటిని అరికట్టాలని దగ్గరలోని ఏర్పేడు పీఎస్ కు వచ్చి సీఐ ని కలిసి వినపత్రం సమర్పించేందుకు వచ్చారు. గత మూడు నెలలుగా ఈ అంశంపై ఫిర్యాదు చేస్తున్నా సీఐ సాయిబాబు పట్టించుకోవడం లేదని రైతుల మాటలను పెడచెవిన పెడతున్నారని, ఈ రోజు రైతులంతా వచ్చి అమీ తుమీ తేల్చుకునేందుకు పీఎస్ వచ్చారు. అయితే పీఎస్ లోపలికి కొంతమందిని మాత్రమే అనిమతించారు. చాలా మంది రైతులు బయట ఉన్నారు. ఈ సమయంలో పూతలపట్టు నుండి శ్రీకాళహస్తి వెళ్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయి వేచివున్న రైతులపైకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న అనేక దుకాణాల మీదుగా కరెంట్ స్థంబాలను ఢీ కొట్టింది. దీంతో అక్కడ ఉన్న మోటారు వాహనాలపై కరెంట్ తీగలు తెగిపడిపోయాయి. వెంటనే పెట్రోలు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో 25 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. మరి కొన్ని శరీరాలు నల్లగా మాడి బూడిదయ్యాయి. తిలారీ దూసుకొస్తున్న సమయంలో రహదారి పక్కన ఎక్కువ మంది నిలబడిఉన్నారు. లారీ మీదికి దూసుకురావడంతో వారంతా హాహాకారాలు చేస్తూ నలుదిక్కులకూ పరుగులు తీశారు. కొందరు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

వామపక్షాలు, వైసీపీ ఆందోళన

ఘటనకు బాధ్యులై సీఐ సాయిబాబును సస్పెండ్ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు వెడల్పు చేయాలి: స్థానికులు

ఏర్పేడు పీఎస్ వున్న రోడ్డు కు స్పీడ్ బ్రేకర్లు లేవని, రోడ్డు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss