అత్యంత ఘనంగా ప్రిన్స్ హ్యారీ వివాహం..

07:09 - May 20, 2018

అమెరికా : లండన్ క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ-అమెరికా నటి మేఘన్ మెర్కెల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లండన్‌లోని విండ్‌సోర్ కేస్టల్‌లోని జార్జ్ చాపెల్‌లో వీరి వివాహం జరిగింది. వివాహానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, డేవిడ్ బెక్‌హామ్, ఓఫ్రా విన్‌ఫ్రే హాజరయ్యారు. తెలుపు రంగు వెడ్డింగ్ డ్రెస్ ధరించిన మేఘన్ వింటేజ్ రోల్స్ రాయ్స్ కారులో ప్రిన్స్ హ్యారీని పెళ్లాడేందుకు వెళ్లారు. వెడ్డింగ్ డ్రెస్‌ను బ్రిటిష్ డిజైనర్ క్లారీ వెయిట్ కెల్లెర్, ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్‌కు చెందిన ఆర్టిస్టిక్ డైరెక్టర్ గివెంచీ కలిసి రూపొందించారు. ఆరు వందల మంది అతిథుల ఎదుట కొత్తజంట ఉంగరాలు మార్చుకున్నారు. 

Don't Miss