మరో మరణ మృదంగం..32 మంది మృతి...

15:24 - July 28, 2018

ఢిల్లీ : దేశంలో మరో మరణ మృందంగం మోగింది. గత కొన్ని రోజులుగా కొన్ని దుర్ఘటనల వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బస్సు లోయలో పడిపోవడంతో 32మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘోరమైన దుర్ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. దపోలీలోని డా.బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ కు చెందిన కొంతమంది విద్యార్థులు మహాబలిపురానికి విహార యాత్రకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు అంబేనాలీ ఘాట్ ప్రాంతంలో అదుపు తప్పింది. సుమారు 800 అడుగుల లోయలో పడిపోయ్యింది. ఈ సమయంలో ఒక వ్యక్తి బస్సు నుండి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

అతను తెలిపే వరకు బాహ్యా ప్రపంచానికి ఈ విషాద ఘటన తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. బస్సులో ఉన్న 32 మంది మృతదేహాలను అధికారులు బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్డు సరిగ్గా లేకపోవడమా ? డ్రైవర్ నిర్లక్ష్యమా ? అనేది తెలియరాలేదు. 

Don't Miss