ఖమ్మంలో ప్రయివేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం..

18:26 - December 2, 2016

ఖమ్మం : ఖమ్మంలో వైద్యులు రోగుల ప్రాణాలు తీస్తున్నారు.. డబ్బుల మీద ఉన్న ఆశ.. రోగుల ప్రాణాలను కాపాడ్డంలో లేదు. రోగులకు అసలు విషయం చెప్పకుండా... ఆపరేషన్‌ చేయడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పో యే పరిస్థితి వచ్చింది. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే గొడవచేస్తే ..మీ అంతుచూస్తామంటూ రౌడీలతో బెదిరస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగి బంధువులు. .స్పందన హార్ట్ కేర్ ఆసుపత్రి వైద్యులు నిర్వాకం బైటపడింది. గర్భసంచిలో గడ్డతో పాటు మరో ఆపరేషన్ ను ఒకేసారి చేశారని..ఆపరేషన్ సక్సెస్ కాలేదని మరోసారి ఆపరేషన్ చేయాలని వైద్యులు అంటున్నట్లుగా బంధువులు పేర్కొంటున్నారు. తొమ్మిదిరోజుల పాటు ఐసీయూలోనే వుంచినట్లుగా బంధువులు పేర్కొన్నారు. ఆపరేషన్ నిమిత్తం రూ.10లక్షల ఫీజ్ వసూలు చేశారని..తీరా ఆసుపత్రికి వచ్చిన తరువాత రౌడీలతో దాడిచేయిస్తామని వైద్యులు బెదిరిస్తున్నారని బంధువులు వాపోతున్నారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని..సదరు మహిళకు ఆపరేషన్ నిమిత్తం ఖర్చు వైద్యులే చెల్లించానలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss