టెన్ టివి కథనం..ఖమ్మం కలెక్టర్ స్పందన..

14:27 - December 4, 2016

ఖమ్మం : స్పందన హార్ట్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకంపై 10టీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పందిచారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి బాధితురాలికి న్యాయం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్యాస్ ట్రబుల్ అని ఆసుపత్రిలో చేరిన సూర్యాపేట వాసి కవితకు చేసిన ఆపరేషన్ వికటించింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని.. సిబ్బంది ఎవరు అందుబాటులో లేరని డిప్యూటీ డిఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ తెలిపారు. సోమవారం సాయంత్రం కల్లా కవిత కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని లేదంటే ఆసుపత్రిని సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.

Don't Miss