ద్రవిడ రాజకీయాలో 'కరుణ' మార్క్..

20:39 - August 7, 2018

డీఎంకే అధినేత, మాజీ సీఎం, సినీరంగం ఇలా ఏది చూసినా కరుణానిధి ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. సినిమా రచయితగా ప్రారంభించారు కరుణానిధి, 14 ఏళ్ల వయసులోనే కరుణ రాజకీయపరంగా యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలగిరిస్వామి స్ఫూర్తితో ఆయన స్థానికంగా ఓ యూత్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. దీంతోపాటు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు. అనంతరం... 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. డీఎంకే తొలి అధినేత కరుణానిధే కావడం గమనార్హం. పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉండేవారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన తొలి వ్యక్తి కరుణానిధి..మరి కరుణానిధి గురించి మరింతగా ప్రముఖ విశ్లేషకులు నడింపల్లి సీతారామ రాజు విశ్లేషణలో తెలుసుకుందాం..

Don't Miss