కళ్యాణ్ చిత్రంలో హరికృష్ణ..ఎన్టీఆర్ ?

15:23 - December 6, 2016

'ఇజం' ప్లాప్ తో షాక్ అయిన 'కళ్యాణ్ రామ్' ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసినట్లు వినికిడి. తన కొత్త మూవీలో తండ్రి 'హరికృష్ణ'తో పాటు తమ్ముడు 'ఎన్టీఆర్' కీ రోల్స్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'కళ్యాణ్ రామ్' కి హిట్టు ఇచ్చిన ఓ యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ చేయబోతున్నట్లు టాక్. 'ఫటాస్' బంపర్ హిట్టు తో ఫాంలోకి వచ్చిన 'కళ్యాణ్ రామ్' కాలం కలిసిరాలేదు. 'పూరీ జగన్నాథ్' డైరెక్షన్ లో ఈ నందమూరి హీరో నటించిన 'ఇజం' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కానీ 'ఇజం' రిజల్ట్ 'కళ్యాణ్ రామ్' ని షాక్ కి గురి చేసింది. దీంతో సెలైంట్ అయిపోయిన ఈ హీరో ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్ లో కొత్త మూవీకి రెడీ అవుతున్నట్లు వినిపిస్తుంది.

యువ దర్శకుడు అనిల్ రావిపూడి..
కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో కొత్త మూవీకి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను పూర్తిచేసే పనిలో ఓ యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్లు సమాచారం. ఈ దర్శకుడు 'కళ్యాణ్ రామ్' 'ఫటాస్' లాంటి సూపర్ హిట్టు తీసిన సంగతి తెలిసిందే. ఈ దర్శకుడే 'కళ్యాణ్' కోసం మరోసారి కత్తి లాంటి స్టోరీ రెడీ చేశాడట. అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో చేయనున్న ఈ కొత్త చిత్రంలో 'హరికృష్ణ' ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నాడట. ఈ పాత్రను దర్శకుడు చాలా వైవిధ్యంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు టాక్. అలాగే మరో ముఖ్యపాత్రలో యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' కూడా కనిపించబోతున్నాడని టాక్. ఇలా క్రేజీ కాంబినేషన్ సెట్ చేసి సినిమా ఓపెనింగ్ కి ముందే 'కళ్యాణ్ రామ్' సినిమాపై ఆకస్తి కలిగేలా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను 'కళ్యాణ్ రామ్' త్వరలోనే వెల్లడించనున్నట్లు వినిపిస్తుంది.

Don't Miss