'ప్రిన్స్'తో మరోసారి..కలిసొచ్చేనా ?

15:19 - December 6, 2016

'కాజల్ అగర్వాల్' మరోసారి 'మహేష్ బాబు' పక్కన నటించే ఛాన్స్ పట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే రెండు సార్లు 'ప్రిన్స్' తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రోమాన్స్ చేయబోతుంది. క్రేజీ మూవీలో 'మహేష్' పక్కన ఈ బ్యూటీ సెట్ అయినట్లు టాక్. 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత తెలుగులో 'కాజల్ అగర్వాల్' కి కొత్త సినిమా రాలేదు. మధ్యలో 'ఎన్టీఆర్' కోసం 'జనతా గ్యారేజ్' లో ఐటం సాంగ్ చేసింది. ఆరు నెలల పాటు తెలుగులో ఒక్క ఛాన్స్ రాకపోవడంతో ఇక 'కాజల్' పని అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ లేటేస్ట్ ఈ బ్యూటీ మరోసారి 'మహేష్' తో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుందని వినికిడి.

ప్రిన్స్ మూడో సినిమాలో..
'కాజల్' ఇంతకు ముందు 'మహేష్ బాబు' 'బిజినేస్ మేన్', 'బ్రహ్మోత్సవం' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో 'బిజినేస్ మేన్' హిట్టు కాగా ఈ ఎడాది రిలీజైన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా 'ప్రిన్స్' తన కొత్త మూవీ కోసం మరోసారి ఈ బ్యూటీ వైపే మొగ్గుచూపాడట. ప్రస్తుతం 'ప్రిన్స్' మురుగదాస్ తో పాటు కొరటాల శివతో సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఈ స్టార్ హీరో వంశీపైడిపల్లితో న్యూ మూవీ కమిట్ అయ్యాడట. ఈ మూవీలోనే 'మహేష్' పక్కన 'కాజల్' ని ఫిక్స్ చేసినట్లు వినిపిస్తుంది. ఒక హిట్టు ఒక్క ప్లాప్ అందుకున్న కాంబినేషన్ థర్డ్ టైం ఎలాంటి రిజల్ట్ ని చవిచూస్తారో చూడాలి.

Don't Miss