అంధుడిగా జూ.ఎన్టీఆర్ ?

12:05 - March 19, 2017

జూనియర్ ఎన్టీఆర్...వరుస విజయాలతో ముందుకు వెళుతున్నాడు. ఆయన నటించిన 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌' మూడు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీనితో నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న చిత్రంలో 'ఎన్టీఆర్' నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనేక విషయాలు దాగున్నాయి. ఏకంగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ‘రాశీఖన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్ సరసన ఆడి..పాడనున్నారు. శక్తివంతమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌.. ఓ పాత్రలో అంధుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేగాకుండా ఓ పాత్ర చాలా ఆసక్తికరంగా మలుస్తున్నట్లు టాక్. సినిమా టైటిల్ విషయంలో క్లారిటీ రావడం లేదు. గతంలో అనుకున్నట్లుగానే 'జై లవకుశ' పేరు చిత్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Don't Miss