ఆసుపత్రి నుండి అంతిమయాత్రకు అమ్మ..

09:55 - December 6, 2016

తమిళనాడు : అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారని అపోలో ఆస్పత్రి వైద్యలు ప్రకటించారు. సెప్టెంబర్‌ 22న జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయ అప్పటి నుంచి మరణించే వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు.

సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస
జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని, ఆమె ఎప్పుడైనా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోవచ్చని అపోలో యాజమాన్యం ఇటీవలే ప్రకటించింది. దీంతో జయ క్షేమంగా తిరిగి వస్తారంటూ ప్రజలంతా ఆనందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తమ అభిమాన నేత జయలలిత హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారనే వార్తలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తమ ప్రియతమ నేత కోలుకోవాలని ప్రజలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేశారు. కానీ తమిళనాడు ప్రజల ఆశలు, నోములు ఫలించలేదు. సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడించారు.

ఆరోగ్యం నిలకడంగా ఉందని సెప్టెంబర్‌ 24 ప్రకటించిన డాకర్టర్లు
జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కన్నుమూసే వరకు జరిగిన పరిణామక్రమాన్ని ఓసారి పరిశీలిద్దాం... ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 తీవ్ర జ్వరం, డీహ్రైడ్రేషన్‌ సమస్యలతో జయలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని సెప్టెంబర్‌ 24న అపోలో వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 25న చికిత్స కోసం జయలలితను విదేశాలకు తరలిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. అయితే ఈ వదంతుల్ని అపోలో ఆస్పత్రి వర్గాలు తోసిపుచ్చాయి. చికిత్సకు జయ స్పందిస్తున్నారని సెప్టెంబర్‌ 29న అపోలో వైద్యులు ప్రకటించారు. అయితే ఆరోగ్యం మరింత కుందుపడే వరకు మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఆమె ఉండాలని సూచించారు.

అక్టోబర్‌ 1 జయ ఆరోగ్యంపై వస్తున్న వందతులను ఖండించిన అపోలో
జయలలిత ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల్నిగత అక్టోబర్‌ 1న అన్నాడీఎంకే వర్గాలు, ఆస్పత్రి యాజమాన్యం ఖండించాయి. ఆమె ఆస్పత్రి నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ప్రకటించాయి. అక్టోబర్‌ 2నజయలలితకు యాంటీబయోటిక్స్‌తో చికిత్స అందిస్తున్నట్టు లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలే ఆధ్వర్యంలోని వైద్య బృందం ప్రకటించింది. జయలితకు మెరుగైన వైద్యం అందించేందుకు అక్టోబర్‌ 6నఎయిమ్స్‌ నుంచి ప్రత్యేక వైద్య బృందం చెన్నైకి చేరుకుంది. వెంటిలేటర్‌పై ఉన్నట్లు అక్టోబర్‌ 7న ప్రకటించారు. అక్టోబర్‌ 21న జయలలిత కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇది పునర్జన్మ అంటూ నవంబర్‌ 13 లేఖపై జయలలిత సంకతం
జరుగుతున్న విషయాలను అర్థం చేసుకుంటున్నారని నవంబర్‌ 7న ప్రకటన ..తనకు ఇది పునర్జన్మ అంటూ నవంబర్‌ 13న లేఖపై జయలలిత సంకతం ..నవంబర్‌ 19న అత్యవసర చికిత్సా విభాగం నుంచి ప్రైవేటు గదికి తరలింపు ..జయలలిత మాట్లాడుతున్నారని గత నెల 25న ప్రకటించిన అన్నా డీఎంకే వర్గాలు

జయలలిత పూర్తిగా కోలుకున్నారు : అపోలో వైద్యులు

జయలలిత పూర్తిగా కోలుకున్నారనీ, తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నారని గతనెల 7న అపోలో వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మ లభించిందని జయలలిత నవంబర్‌ 13న లేఖపై సంతకం చేశారు. అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వేచి ఉన్నట్లు తెలిపారు. నవంబర్‌ 19న అత్యవసర చికిత్సా విభాగం నుంచి ప్రైవేటు గదికి తరలించారు. వెంటిలేటర్‌ లేకుండా జయలలిత శ్వాస తీసుకుంటున్నారని అపోలో డాక్టర్లు వెల్లడించారు. జయలిత స్పీకర్‌ సాయంతో మాట్లాడినట్లు గత నెల 25న పార్టీ వర్గాలు తెలిపాయి.జయ పూర్తిగా కోలుకున్నారనీ, ఆస్పత్రి నుంచి ఎప్పుడైనా డిశ్చార్జి కావచ్చని అన్నాడీఎంకే ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మళ్లీ పరిస్థితి విషమించింది.

డిసెంబర్‌ 4 సాయంత్రం 6 గంటలకు జయకు గుండెపోటు
ఈనెల 4న సాయంత్రం 6గంటల సమయంలో జయకు గుండెపోటు వచ్చింది. దీంతో అత్యవసర చికిత్సా విభాగానికి తరలించడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్‌ 5 మధ్యాహ్నం 12.30గంటలకు అపోలో వైద్యులు జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ప్రకటించారు . గత రాత్రి 11.30 గంటలకు జయలలిత కన్నమూసినట్టు ఆపోలో ఆస్పత్రి ప్రకటించడంతో తమిళనాడు ప్రజల్లో ఒక్కసారిగా విషాఛాయలు అలముకున్నాయి.

75 రోజులుగా మృత్యువుతో పోరాడిన అమ్మ
జయలలిత 75 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. అమ్మ మృతితో అన్నా డీఎంకే శ్రేణుల శోకసముద్రంలో మునిగిపోయి. రాష్ట్ర మంతటా విషాఛాయలు అలముకున్నాయి. అమ్మ ఇకలేరన్న వార్త తెలుసుకుని తమిళులు దుఖఃసాగరంలో మునిపోయారు.

Don't Miss