సాయంత్రం అమ్మకు అంత్యక్రియలు..

09:53 - December 6, 2016

తమిళనాడు : సోమవారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. కొద్దిసేపు అక్కడ ఉంచిన అనంతరం దివంగత నేత పార్థివ దేహాన్ని ప్రఖ్యాత రాజాజీ హాల్‌కు తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఈ రోజు మొత్తం రాజాజీ హాల్లోనే వుంచనున్నారు. ‘అమ్మ’ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. దీంతో అప్పుడే ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రేపు సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయలలిత రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ డీఎంకేతో ఆమె చేసిన పోరాటం, ఆ పార్టీ వల్ల పడిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. తనను తీవ్రంగా అవమానించిన కరుణానిధి ప్రభుత్వాన్ని గద్దె దింపుతా అని డీఎంకేపై సవాలు విసిరారు. తదుపరి ఎన్నికల్లో గెలిచాక అంతకంతా ప్రతీకారం తీర్చుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కరుణానిధిని పోలీసులతో ఇంటి నుంచి బరబరా బయటికి ఈడ్పించి అరెస్ట్ చేయించి తన ప్రతీకారాన్ని ధీశాలి..అమరకాళి జయలలిత. ఆమె సినీ రాజకీయ ప్రస్థానంలో ఆమెచూడని ఎత్తులు లేవంటే అతిశయోక్తి కాదేమో..ఇటువంటి జయమ్మ జీవితంలో ఎన్నో పోరాటాలు..ఆఖరికి మృత్యువుతో కూడా పోరాడి పోరాడి అలసిపోయిన ఓ మహిళా మకుటం సెలవంటూ వెళ్ళిపోయి అభిమానుల గుండెల్లో..చిరస్థాయిగా మిగిలిపోయింది. కోమలవల్లి నుండి అమ్మగా ఆమె ప్రస్థానం అజరామరం.తనకు నచ్చినవారిని అందలం ఎక్కించే అమ్మ తనకు చెడు తలపెట్టేవారిని పాతాళంలోకి తొక్కేయగల సత్తావున్న రాజకీయ చతురతలో ఆరితేరిన జయలలిత మరలిరాని లోకాలకు తరలిపోయింది.

Don't Miss