ఆందోళనబాటలో తెలంగాణ విద్యుత్ కార్మికులు...

06:45 - July 30, 2018

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు ఆందోళన బాట పట్టారు. వారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న 23 వేలకు పైగా ఉన్న ఆర్టిజన్స్‌లను వెంటనే పర్మినెంట్‌ చేయాలని.. పీస్‌ రేటుపై పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని.. అలాగే ఇఎస్‌ఐ, పీఎఫ్‌లను కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో టీవీకేయస్‌ జేఏసీ చైర్మన్‌ ఈశ్వర్‌రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss