బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్

21:34 - June 3, 2017

సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గుండు కొట్టిచ్చి హైదరాబాద్‌లో తిప్పుతానన్న సుమన్ సవాల్ స్వీకరిస్తున్నానని.. ఇదే సమయంలో సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగకుండా చేయగలనని అన్నారు. సుమన్‌కు ధైర్యముంటే కేసీఆర్‌, హరీష్‌రావుతో ఓయూలో మీటింగ్‌ పెట్టించగలవా అని ప్రశ్నించారు. సంగారెడ్డికి రావాలంటే.. కేసీఆర్, హరీష్‌లే భయపడుతారని.. అలాంటిది సుమన్‌ ఎంత అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ మెప్పు కోసం బాల్క సుమన్‌ ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్క సుమన్‌ సంగతి తేల్చుతామంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

Don't Miss