టర్కీలో మాంద్యం..రూపాయిపై ఎఫెక్ట్..

13:42 - August 14, 2018

ముంబై : డాలర్ తో రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా ఒక డాలర్ మారకపు విలువ రూ. 70.08ను తాకింది. టర్కీలో ఆర్థిక సంక్షోభంతో డాలర్ కు డిమాండ్ పెరుగగా, ఆ ప్రభావం రూపాయిపై పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్రితం ముగింపుతో పోలిస్తే, ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్ లో 69.85 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, ఆపై కాసేపటికే ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. 2013, సెప్టెంబర్ 3 తరువాత నిన్న రూపాయి విలువ తొలిసారిగా ఒక్కరోజులో 110 పైసల పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ మరింతగా పడిపోవచ్చని, డాలర్ తో మారకం సమీప భవిష్యత్తులోనే రూ. 71ని దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Don't Miss