ఇంగ్లండ్‌, ఇండియా జట్ల టగ్ ఆఫ్ వార్

21:51 - December 9, 2016

మహారాష్ట్ర : ముంబై టెస్ట్‌ రెండో రోజు ఆటలోనూ ఇంగ్లండ్‌, ఇండియా జట్లు సమానంగా ఆధిపత్యం ప్రదర్శించాయి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసి భారత్‌కు సవాల్‌ విసరగా....టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్‌ టీమ్‌కు ధీటుగా బదులిస్తోంది. అశ్విన్‌, జడేజా స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ జట్టును 400 పరుగులకే కట్టడి చేసిన భారత్‌...తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం చేసింది. రాహుల్‌ తక్కువ పరుగులకే ఔటైనా....మురళీ విజయ్‌, పుజారా క్రీజ్‌లో పాతుకుపోయారు. అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన ఇద్దరూ....రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించి భారత్‌ను పోటీలో నిలిపారు. 126 బంతుల్లో టెస్టుల్లో 15వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన విజయ్‌ 76 పరుగులతో, పుజారా 47 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో  రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్‌ కోల్పోయిన భారత్‌ 146 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 254 పరుగులు వెనుకబడి ఉన్నా భారత జట్టు...టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇదే స్థాయిలో రాణిస్తే మ్యాచ్‌పై పట్టు బిగించగలుగుతుంది.  

 

Don't Miss