కోహ్లీసేనకు పరాజయం

09:12 - August 13, 2018

లండన్ : క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో విజయం సాధించాలనుకున్న కోహ్లీసేన పరాజయంపాలైంది. 159 పరుగుల ఇన్సింగ్స్‌ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌  2-0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాట్స్‌మెన్స్‌ వైఫల్యం కారణంగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో మిగతా మూడు టెస్టులను గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య మినహా ఏ ఒక్కరూ 20 పరుగుల స్కోరుకు కూడా చేరుకోలేదు.  వెన్నునొప్పితో బాధపడుతున్న విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. మూడో టెస్టులోనూ ఆడటం అనుమానంగానే తోస్తోంది. జేమ్స్‌ అండర్సన్‌ , స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌వోక్స్‌, కోహ్లీసేన పతనాన్ని నిర్దేశించారు. 

 

Don't Miss