బంగారంపై ఐటీ కన్ను..తాళిబొట్టుపై ట్యాక్స్ మినహాయింపు!..

16:37 - December 1, 2016

ఢిల్లీ : పాత పెద్దనోట్లను రద్దుచేసి 23రోజులు కొనసాగుతున్నాయి. దీనిపై సామాన్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు..ఇప్పుడు తాజాగా ఐటీ శాఖ ప్రజలను మరో సంకట స్థితిలోకి నెట్టింది..బంగారంపై ఐటీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వివాహం అయిన మహిళ వద్ద 500 గ్రాముల బంగారం..అవివాహిత మహిళల వద్ద 250 గ్రామలు.. అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా వివాహిత మహిళలు సంప్రదాయబద్ధంగా మెడలో వేసుకునే మంగళసూత్రాలపై ఐటీ శాఖ మినహాయింపునిచ్చింది. తాళిబొట్టుపై ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా తెలిపింది. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో కొనుగోలు చేసిన‌ బంగారంపై ప‌న్ను విధించే నేప‌థ్యంలో తాము తీసుకోనున్న చ‌ర్య‌ల్లో భాగంగా వార‌స‌త్వంగా వ‌చ్చిన‌, లెక్క‌చూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి ప‌న్నులు ఉండబోవ‌ని కేంద్ర ఆర్థిక ఖాల స్ప‌ష్టం చేస్తున్నట్లుగా సమాచారం..దీనిపై మహిళల వద్ద నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా వారసత్వంగా వచ్చిన బంగారంపై ఐటీ శాఖ ఏవిధమైన నిబంధనలు విధించనుందో వేచి చూడాలి. కాగా భారత దేశంలో మహిళలు ఎక్కువగా బంగారంపైనే ఖర్చుపెడుతుంటారు. ఇది కుటుంబావసరాలకు పలు విధాలుగా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. మరికొంతమంది బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

Don't Miss