శేఖర్‌ రెడ్డి నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

21:47 - December 9, 2016

చెన్నై : టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి అక్రమ సంపాదన తవ్వేకొద్ది బయటపడుతోంది. చెన్నైలోని నలుగురు తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. 6 ఇళ్లు, 2 ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 106 కోట్ల 52 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించింది. ఇందులో 9కోట్ల 63 లక్షలు కొత్త రెండు వేల నోట్లు కాగా.. 96 కోట్ల 89 లక్షలు పాత పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. 36 కోట్ల 29 లక్షలు విలువ చేసే 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. 12 వందల కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నామని ఆర్థిక శాఖ ప్రకటించింది. 

 

Don't Miss