టిటిడి బోర్డు సభ్యుడి వద్ద రూ. 90 కోట్లు..

16:47 - December 8, 2016

చెన్నై : పెద్ద నోట్ల రద్దు పేదోడి నుండి సామాన్యుడు..మధ్య తరగతి వారిని కుదేలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 2వేల కోసం గంటలు గంటలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏటీఎం..బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఇదిలా ఉంటే మాత్రం 'పెద్దోళ్ల'కు మాత్రం డబ్బులు సులువుగానే అందుతున్నాయని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇంట్లో దొరికిన నగదు..బంగారం చూసి షాక్ తినాల్సిందే. టిటిడి బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డి ఉన్నారు. ఇతడిని ఇటీవలే మృతి చెందిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సిఫార్సు మేరకు సభ్యుడిగా నియమించినట్లు తెలుస్తోంది. ఇతనిపై పలు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఏకంగా ఇంట్లో రూ.90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం లభ్యం కావడం ఐటీ అధికారులు షాక్ తిన్నారు. లభ్యం చేసుకున్న నోట్లలో రూ. 70 కోట్లు కొత్త నోట్లు, రూ. 20 కోట్లు పాత నోట్లు ఉన్నాయి. తనిఖీల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. శేఖర్ రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లపై కూడా సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss