భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌ అతలాకుతలం

22:12 - July 29, 2018

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు 70 మంది మృత్యువాతపడగా.. 77మంది గాయపడ్డారు. ఒక్క షహరాన్‌పూర్‌ జిల్లాలోనే 11 మంది చనిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో... 488 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి ఘోరంగా ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని... సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బందులున్న ప్రాంతాల్లో పర్యటించి... సహాయకచర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలన్నారు. మరోవైపు సోమవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

Don't Miss