యూపీలో వర్షాలు..27మంది మృతి..

08:39 - July 28, 2018

ఉత్తరప్రదేశ్‌ : కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. భారీ వర్షాలకు ఆగ్రాలో ఐదుగురు, మెయిన్‌పురిలో నలుగురు, ముజఫర్‌నగర్, కాస్‌గంజ్‌లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. మీరట్‌, బరేలీలో ఇద్దరు చొప్పున...కాన్పూర్‌, మాథుర, ఘజియాబాద్, హాపుర్, రాయబరేలి, జలన్‌, జాన్‌పూర్‌లో ఒకరు చొప్పున మరణించినట్లు ఆ అధికారి వెల్లడించారు. మరో 12 మంది గాయపడ్డారు. గురువారం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రుతుపవనాలు చురుకుగా ఉండడంతో ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Don't Miss