'నితిన్'తో 'నిఖిల్' మూవీ..!

15:15 - December 1, 2016

యంగ్ హీరో 'నిఖిల్' తో మరో యంగ్ హీరో 'నితిన్' మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు యంగ్ స్టర్స్ కాంబినేషన్ లో రానుంది మల్టీస్టారర్ మూవీ మాత్రం కాదండోయి. 'నిఖిల్' మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. క్రిటికల్ సిట్యూవేషన్ లో కూడా ఈ యంగ్ హీరో 'ఎక్కడిపోతావు చిన్నవాడా' సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు. ఈ మూవీ సక్సెస్ తో నిర్మాతలు 'నిఖిల్' వెంటపడుతున్నారు. తనతో సినిమా చేసి క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో 'నితిన్', 'నిఖిల్' తో మూవీ నిర్మించబోతుండడం వెరీ స్పెషల్ గా మారింది. హ్యట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న 'నిఖిల్' స్పీడ్ కి 'శంకరాభరణం' ప్లాప్ అడ్డకట్టవేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ఈ యంగ్ హీరో మరోసారి తనదైన శైలిలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి భిన్నమైన మూవీతో సర్ ప్రైజింగ్ సక్సెస్ కొట్టాడు.

నిఖిల్ కోసం క్యూ..
దాంతో ఒక్కసారిగా నిర్మాతలు 'నిఖిల్' తో సినిమాలు నిర్మించడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 'దిల్' రాజు ఈ యంగ్ హీరోకి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాడు. 'దిల్' రాజు తో పాటు అభిషేక్ పిక్చర్ కూడా 'నిఖిల్' తో ఓ మూవీని అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు లేటేస్ట్ గా 'నితిన్' కూడా ఈ యంగ్ హీరో తో మూవీ చేయడానికి కమిట్ మెంట్ తీసుకున్నట్లు వినికిడి. ఇప్పటికే 'నితిన్ - నిఖిల్' మధ్య చర్చలు జరిగాయని, ఇద్దరూ కలసి ఓ ప్రాజెక్టు చేయడానికి అంగీకారం కుదిరిందని అంటున్నారు. కాగా, పనిలో పనిగా తన పారితోషికాన్ని 'నిఖిల్' భారీగా పెంచేసినట్టు సమాచారం. 

Don't Miss