బంగారం..గందరగోళంలో మహిళలు..

19:31 - December 2, 2016

ఢిల్లీ : బంగారంపై ఐటీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో దేశంలోని మహిళా లోకం తీవ్ర గందరగోళం పడిపోయారు. తమ వద్ద వున్న బంగారంపట్ల వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు..కానీ ఐటీ శాఖ బంగారంపై జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా వున్నాయి.. వివాహం అయిన మహిళ వద్ద 500 గ్రాముల బంగారం..అవివాహిత మహిళల వద్ద 250 గ్రామలు.. అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా వివాహిత మహిళలు సంప్రదాయబద్ధంగా మెడలో వేసుకునే మంగళసూత్రాలపై ఐటీ శాఖ మినహాయింపునిచ్చింది. తాళిబొట్టుపై ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా తెలిపింది.

బంగారంపై స్పష్టతనిచ్చిన మంత్రి జైట్లీ
బంగారంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుందని... అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉంటే పన్ను విధించనున్నారు. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి ప్రస్తుతం జారీ చేసిన మార్గదర్శకాలు కాదని.. గతంలో కూడా ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. దీనిపై ఇంకా గందరగోళంలో పడిపోయిన మహిళా లోకం నుండి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో సునీతా రావు(టీ.పీసీసీ సెక్రటరీ)ఉప్పల శారద (బీజేపీ నేత) మంజుల (అడ్వకేట్)పాల్గొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

Don't Miss