పంజాబ్ లో హార్ట్‌ ఆఫ్‌ ఏషియా శిఖరాగ్ర సదస్సు

13:48 - December 3, 2016

చంఢీఘర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోహార్ట్‌ ఆఫ్‌ ఏషియా శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. భారత్‌, అఫ్గనిస్థాన్‌ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న సమావేశానికి  40 మందికిపైగా విదేశాంగ మంత్రులు, వారి ప్రతినిధులు హాజరవుతున్నారు.  అమెరికా, ఇరాన్‌, రష్యా, కెనడా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌తోపాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు చెందిన అతిథులను ఆహ్వానించారు. పాకిస్థాన్‌ తరుపున ఆదేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్ సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ హాజరుకానున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల అక్రమచొరబాట్లు, కశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడులు పెరుగుతున్న నేపథ్యలో జరుగుతున్న హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, అఫ్గన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ మంత్రుల స్థాయి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఉరి, నగ్రోటా ఉగ్రవాద దాడులను ప్రస్తావించడం ద్వారా  పాకిస్థాన్ను ఏకాకిని చేయాలని మన దేశం భావిస్తోంది. ఉగ్రవాదంతో చితికిపోయిన అఫ్గనిస్థాన్‌లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. 

Don't Miss