కరివేపాకులు ఆరోగ్యం..అందం..

09:33 - February 8, 2017

కరివేపాకులు తినడం వల్ల కొన్ని పోషకాలు అందుతాయనే విషయం తెలిసిందే. తద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినడమే కాకుండా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖానికి..తలకు పట్టించినా కూడా మంచిదే. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

  • ముఖ వర్ఛస్సును పెంచడమే కాకుండా జుట్టుకి మెరుపుదనాన్ని ఇస్తుంది.
  • మొటిమలు..ఇతరత్రా వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనిని నుండి బయటపడాలంటే కరివేపాకులకు కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్టు చేయాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విశ్రమాన్ని మొటిమలు..మచ్చలున్న చోట రాయాలి. మంచి ఫలితం ఉంటుంది.
  • పచ్చి కరివెపాకులను ముద్దలా చేసి అందులో పెరుగు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. తరువాత షాంపుతో స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది.
  • కొబ్బరినూనెని గోరువెచ్చగా మరగబెట్టి అందులో కరివేపాకులు వేయాలి. తలస్నానం చేసే ముందు ఆ నూనె బాగా తలకి పట్టించి ఓ అరగంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్న తనంలో జుట్టు నెరిసిపోయే సమస్య తగ్గుతుంది.
  • కరివేపాకు పేస్టులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మచ్చలున్న చోట రాయాలి. ఇలా తరచూ చేస్తే మచ్చలు తొలగిపోతాయి.
  • కరివేపాకు పేస్టులో ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి.

Don't Miss