అరటితో అందం..ఆరోగ్యం…

11:40 - December 8, 2016

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరి చేరవు. అలాగే పండ్లతో కూడా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందులో 'అరటి' కూడా ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద అరటిని పండించే విషయంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. మరి ఈ అరటిని తీసుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. మరి అవేంటో చూద్దామా…

 • మేక మాంసం..సగానికి కోసిన కోడిగుడ్డు..ఆవుపాలులో ఎంత శక్తి ఉందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది.
 • పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచి కొలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
 • అరటి పండులో కొవ్వు పదార్థం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది. కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
 • అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతో పాటు తిన్నా సరిపోతుంది.
 • జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
 • పచ్చి అరటి కాయలు విరోచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
 • అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

అందం..

 • బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదమాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్ తో కూడిన మొటిమలలోని బాక్టీరియాను అరటిపండులోని పొటాషియం హరించి వేయడంతో అవి చాలా త్వరగా తగ్గిపోతాయి.
 • ఈ ప్యాక్‌ నే ఎండవల్ల కమిలిన చర్మాన్ని సహజ స్థితికి తీసుకొచ్చేందుకు ఉపయోగించవచ్చు.
 • పండిన అరటిపండును తీసుకుని మెత్తగా చిదమాలి. దీనిని మాడుకు జుట్టుకు పట్టించాలి. తలకు ఏదైనా కట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచిన తరువాత షాంపూతో కడుక్కోవాలి. దీనితో జుట్టు ఆరోగ్యవంతంగా అవుతుంది.
 • పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని, ముఖానికి పట్టించి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముఖానికి తేమ, నునుపుదనం ఇస్తుంది.
 • పండులో ఉండే 'ఇ' విటమిన్‌ ఉండడం వల్ల ముఖంలో వయసు తాలూకు ఛాయలను కనిపించకుండా చేస్తుంది.
 • ఓట్‌మీల్‌, కొబ్బరిపాలు పండు గుజ్జుకు జోడించి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి.
 • అరటి పండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే పగుళ్లు రాకుండా ఉంటాయి. 

Don't Miss