'హరికృష్ణ' అంతిమ చూపు కోసం...

06:29 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్‌ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. చైతన్య రథంపైన హరికృష్ణ అంతిమయాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు పలువురు అభిమానులు తరలివస్తున్నారు

Don't Miss