నోయిడాలో కుప్పకూలిన రెండు భవనాలు..

08:46 - July 18, 2018

ఉత్తరప్రదేశ్ : నోయిడాలో రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. నిర్మాణంలో వున్న ఆరంతంస్థుల భవనం పక్కనున్న మరో నాలుగంతస్థుల భవనంపై కూలిపోవటంతో రెండు భవనాలు కూలిపోయాయి. బ్రిసాక్ పీఎస్ పరిధిలోని షాటెరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఘజియాబాద్ నుండి వచ్చి సహాయక చర్యల్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరు మృతదేహాలను వెలికి తీసారు. ఈ ఘటనలో శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లుగా సమాచారం. ఆ భవనంలో 18 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీయగా, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Don't Miss