టీచర్..నగలు అమ్మి ఏం చేసిందో తెలుసా ?

14:01 - April 21, 2017

క్లాస్ రూం అంటే ఎలా ఉండాలి ? వృత్తి పట్ల ఎంత మంది టీచర్లు నిబద్ధతగా పనిచేస్తున్నారు ? కానీ ఓ టీచర్ ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలోని కందాడు ప్రైమరీ పాఠశాలలో అన్నపూర్ణ మోహన్ అనే ఇంగ్లీషు టీచర్ పనిచేస్తున్నారు. ఈ క్లాస్ రూంలో ఉన్న పిల్లలకు మంచి సౌకర్యాలు ఉండాలని అభిలషించారు. అందరికీ ఇంగ్లీష్ భాష వచ్చే విధంగా కృషి చేయాలని భావించారు. కానీ దీనికి డబ్బు అవసరం పడింది. దీనితో ఆమె నగలు అమ్మి సౌకర్యాలను సమకూర్చింది. క్లాస్ రూంలో ఉన్న సౌకర్యాలు..తరగతికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంగ్లీష్ బోధన చేసే సమయంలో తనకు కొన్ని సమస్యలు ఏర్పడడం జరిగిందని, అయితే బోధనలో విద్యార్థులను మమేకం చేస్తూ స్కిట్ లు తదితర పద్ధతుల్లో పాఠాలు బోధించే దానినని పేర్కొన్నారు. విద్యార్థుల ఇంగ్లీష్ సామర్థ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా విశేష స్పందన వచ్చిందన్నారు. కొంచెం కృషితో పేద విద్యార్థులకు క్వాలిటీ విద్యనందించే అవకాశం ఉందని అన్నపూర్ణ పేర్కొన్నారు.

Don't Miss